చాలామంది స్టార్ హీరోలు వాళ్లకు వాళ్లే డబ్బింగ్ చెప్పుకుంటూ ఉంటారు . వేరే భాషల్లో సినిమా డబ్ అయినప్పుడు .. వాళ్ళకి ఆ భాష రాకపోయినా.. వాళ్ళ వాయిస్ ఆ భాషకి సెట్ అవ్వదు అనుకున్న అంత సునాయాసంగా.. ఆ భాష మేము మాట్లాడలేము.. సినిమా దెబ్బ అయిపోతుంది అన్న భయం ఉన్న.. ఆ బాధ్యతలను వేరే వాళ్ళకి అప్పగిస్తూ ఉంటారు మేకర్స్ . ఇలా ఇండస్ట్రీలో చాలామంది హీరో – హీరోయిన్ల విషయంలో జరుగుతుంది .
ఒక స్టార్ హీరోకి మరో హీరో డబ్బింగ్ చెప్పడం .. ఒక హీరోయిన్ కి మరొక హీరోయిన్ డబ్బింగ్ చెప్పడం ఇండస్ట్రీలో సర్వసాధారణం . అయితే బాలీవుడ్ ఇండస్ట్రీలో బడా హీరోగా.. ఇంకా చెప్పాలి అంటే బాలీవుడ్ ఇండస్ట్రీని ఏలేసే రారాజుగా ఉన్న బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కు మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ డబ్బింగ్ చెప్పాడు. యస్ ఇది నిజం. ఆ విషయం చాలా తక్కువ మందికే తెలుసు .
ఆ సినిమా మరేదో కాదు. “ప్రేమ్ రతన్ కి ధన్ పాయో” . ఈ సినిమా తెలుగులో డబ్బైంది. అయితే ఈ సినిమాకి సల్మాన్ ఖాన్ కోసం రామ్ చరణ్ తన వాయిస్ ని హెల్ప్ చేశాడు . భారీ ఎక్స్ పెక్టేషన్స్ తో ఈ సినిమా ని చేశాడు. ఈ సినిమా పెద్దగా సక్సెస్ కాకపోవడంతో ఈ విషయం చాలా తక్కువ మందికే తెలిసింది. అయితే మెగా ఫాన్స్ ఇదే న్యూస్ ట్రెండ్ చేస్తున్నారు . రామ్ చరణ్ ఈగోలకు పోడు అని.. ఫ్రెండ్షిప్ కోసం ఏమైనా చేస్తాడు అని దానికి ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఇదే అంటూ చెప్పుకొస్తున్నారు..!!