Moviesనందమూరి బాలయ్య లైఫ్ లోనే మర్చిపోలేని పీడ కల ఇది.. ఎన్ని...

నందమూరి బాలయ్య లైఫ్ లోనే మర్చిపోలేని పీడ కల ఇది.. ఎన్ని సంవత్సరాలు గడిచిన మాయని గాయం..!!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో బాలకృష్ణకు ఎలాంటి ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు. ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్నా కానీ మాస్ హీరో అనగానే అందరికీ బాలకృష్ణ గుర్తొస్తాడు . తొడ కొట్టడాలు.. మీసాలు మెలివేయడాలు బాలకృష్ణ తర్వాతే మరి ఎవరైనా చేయగలరు. ఇప్పటికీ ఆ స్థాయిని ఎవరు అందుకోలేకపోతున్నారు . అలాంటి ఓ క్రేజీ ఘనత అందుకున్నాడు బాలయ్య.

కాగా ప్రజెంట్ బాబీ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్న బాలయ్య త్వరలోనే బోయపాటి దర్శకత్వంలో మరో సినిమాలో నటించబోతున్నాడు అని.. అది అఖండ 2 నే అంటూ ప్రచారం జరుగుతుంది . ఇలాంటి క్రమంలోనే కొన్నాళ్లపాటు రాజకీయాల్లో బిజీ అవ్వడంతో సినిమా ఇండస్ట్రీకి బ్రేక్ చెప్పాడు అంటూ కూడా వార్తలు వినిపిస్తున్నాయి . రీసెంట్గా బాలకృష్ణకి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ గా మారింది .

టాప్ డైరెక్టర్గా పాపులారిటీ సంపాదించుకున్న దాసరి నారాయణరావు – బాలకృష్ణకు హిట్ ఇవ్వలేకపోయాడు అంటూ అప్పట్లో వార్తలు వినిపించాయి. దాసరి నారాయణరావు.. ఎన్టీఆర్ – నాగేశ్వరరావు -కృష్ణ -శోభన్ బాబు లాంటి హీరోలకు సూపర్ సక్సెస్ ఇచ్చారు. కాగా బాలకృష్ణతో పరమవీరచక్ర సినిమా మాత్రం ఫ్లాప్ అయింది . ఆయన కెరియర్ లో బాలయ్యతో చేసిన ఒకే ఒక్క సినిమా పరమవీరచక్ర . ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. దీనితో లెజెండరీ డైరెక్టర్గా గుర్తింపు సంపాదించుకున్న దాసరి గారు బాలయ్య బాబుకు సక్సెస్ ఇవ్వలేకపోయాడు అంటూ అప్పట్లో వార్తలు వినిపించాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news