Moviesఓరి బాబోయ్.. బన్నీ వేసుకున్న ఈ బ్లాక్ షర్ట్ కాస్ట్...

ఓరి బాబోయ్.. బన్నీ వేసుకున్న ఈ బ్లాక్ షర్ట్ కాస్ట్ ఎంతో తెలుసా..? మరీ టూమచ్ గా లేదు..!!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక స్టార్ సెలబ్రిటీస్ వేసుకునే షర్ట్స్ .. వాడే యాక్ససరీస్ బాగా ట్రెండ్ అవుతున్నాయి . సోషల్ మీడియా పుణ్యమాంటూ సెలబ్రిటీలు తుమ్మిన ..దగ్గినా కూడా అది బాగా వైరల్ అయిపోతుంది . ఈ మధ్యకాలంలో అలాంటి వీడియోస్ మనం చాలానే చూసాం. రీసెంట్గా సోషల్ మీడియాలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఓ విషయాన్ని బాగా ట్రెండ్ చేస్తున్నారు . తాజాగా అల్లు అర్జున్ వేసుకున్న బ్లాక్ కలర్ షర్ట్ ను తెగ వైరల్ చేస్తున్నారు .

పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిన అల్లు అర్జున్ గ్లోబల్ స్థాయిలో ఇంటర్వ్యూ ఇస్తూ బిజీబిజీగా ముందుకు వెళ్తున్నారు. స్టైలిష్ స్టార్ అంటేనే అల్లు అర్జున్ .. స్టైల్ మరింత స్టైల్గా ప్రదర్శిస్తూ ఉంటారు. బన్నీ ఫ్యాన్స్ కు ఆయన స్టైల్ అంటే చాలా చాలా ఇష్టం . పడి చచ్చిపోతూ ఉంటారు అంతే. ఆయన మెయింటైన్ చేసే స్టైల్ వాడే బ్రాండెడ్ వస్తువులు గురించి తెలుసుకోవాలి అని ఆశ పడుతూ ఉంటారు .

రీసెంట్గా అల్లు అర్జున్ వేసుకున్న బ్లాక్ షర్ట్ ఫోటో బాగా ట్రెండ్ అయింది . 40 ఏళ్లు వచ్చినా సరే ఇంకా హ్యాండ్సమ్ గా కుర్రాడులా కనిపిస్తూ వస్తున్నాడు బన్నీ . దీంతో ఆయనకు సంబంధించిన ఫొటోస్ ను బాగా ట్రెండ్ చేస్తున్నారు . తాజాగా బన్నీ జర్మనీ వెళ్లిన విషయం అందరికీ తెలిసిందే. అక్కడ ఏయిర్ పోర్ట్ లో ఫోటోలు కి వరుసగా ఫోజులిచ్చాడు . ఆ టైంలో బన్నీ వేసుకున్న షర్ట్ అభిమానులకు బాగా నచ్చేసింది.

బ్లాక్ డ్రెస్ లో కోబ్రాల మెరిసిపోయాడు . అందుకే ఫ్యాన్స్ ఈ డ్రెస్ ని దానికి సంబంధించిన డీటెయిల్స్ ని వైరల్ చేస్తున్నారు. ఈ స్వేట్ షర్ట్ ఖరీదు ఏకంగా 28 వేల రూపాయలు అంటూ తెలుస్తుంది. బుర్బెరీ మోనోగ్రామ్ అప్లిక్ కాటన్ స్వెట్ షర్ట్ ను ధరించిన బన్నీ మరింత స్టైలిష్ గా కనిపిస్తున్నారని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news