కృష్ణ – విజయనిర్మల ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద స్టార్ కపుల్ గా పాపులారిటీ సంపాదించుకున్నారు . తెలుగు ఇండస్ట్రీలో ఈ జంటకు డేరింగ్ అండ్ డాషింగ్ కపుల్ అని బిరుదు కూడా ఉంది. ఈ జోడి చాలామందికి ఆదర్శంగా నిలిచింది . వీరిద్దరిని ఆంధ్ర ఫ్రేమ్ నజీర్ – షీలాగా కూడా పిలిచేవారు. అయితే ఇదివరకే కృష్ణకు ఇందిరాదేవితో పెళ్లయిన విషయం అందరికీ తెలిసిందే. కానీ ఆ తర్వాత విజయనిర్మలతో ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నాడు కృష్ణ .
వీళ్ళ పెళ్లికి పరోక్షకంగా కారణమయ్యాడు కమెడియన్ రాజబాబు . ఆ విషయాన్ని స్వయాన కృష్ణ గారు ఓ ఇంటర్వ్యూలో చెప్పడం గమనార్హం. 1967లో తెరకెక్కిన సాక్షి అనే సినిమాకు బాపు దర్శకత్వం వహించారు . ఈ సినిమాలో రాజాబాబు ఓ ముఖ్య పాత్ర పోషించారు . ఈ సినిమా షూటింగ్ రాజమండ్రి దగ్గరలోని పులిదిండిలో జరిగింది . ఈ సినిమాలో ఒక ఫేమస్ పాట ఉంటుంది . అమ్మ కడుపు చల్లగా అనే సూపర్ హిట్ సాంగ్ ఆ ఊరిలో ” మీసాల కృష్ణుడు” అనే గుడిలో జరిగిందట .
పెళ్లి వేడుక నేపథ్యంలో ఈ సాంగ్ షూటింగ్ జరిగింది. ఈ సినిమా షూటింగ్ ఆయన ప్రతి విషయాన్ని శాస్తోత్తంగా చేశాడు బాపు. పెళ్లి తత్తంగాన్ని కూడా సాంప్రదాయ బద్దంగా జరిపించారట . ఆ గుడిలో అబద్ధపు పెళ్లి జరిగినా కూడా అది నిజమవుతుంది అని అప్పట్లో నమ్మేవారు . ఇదే విషయాన్ని రాజాబాబు .. కృష్ణ విజయనిర్మలతో చెప్పారట . “ఈ గుడి చాలా మహిమగలది ఇప్పుడు అబద్ధపు పెళ్లి చేసుకున్నారు త్వరలోనే నిజం కావచ్చు “అంటూ సరదాగా మాట్లాడారట . ఆయన అన్న మాటలే నిజమయ్యాయి . 1969 మార్చి 24న కృష్ణ విజయనిర్మల తిరుపతిలో పెళ్లి చేసుకున్నారు. ప్రజెంట్ దీనికి సంబంధించిన న్యూస్ వైరల్ అవుతుంది..!!