సినిమా ఇండస్ట్రీలో త్రిషకు ఎలాంటి స్పెషల్ క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరి ముఖ్యంగా ఈ అమ్మడు తెలుగు స్టార్ హీరోలు అందరి సరసన నటించి మెప్పించింది. ఈమె నటించిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ హిట్ కావడం గమనార్హం. ఎన్నో సినిమాల్లో తనదైన స్టైల్ లో నటించి అభిమానులను మెస్మరైజ్ చేసిన త్రిష పోనియన్ సెల్వన్ సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది .
ఆశ్చర్యం ఏంటంటే సెకండ్ ఇన్నింగ్స్ లోను జెట్ స్పీడ్ లో దూసుకుపోతుంది. కాగా ఈ ముద్దుగుమ్మ రీసెంట్గా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తనపై వస్తున్న రూమర్స్ కు చెక్ పెట్టడమే కాకుండా షాకింగ్ కామెంట్స్ చేసింది . “నేను చాలామందితో డేటింగ్ చేశాను ..అది నిజమే .. రిలేషన్ షిప్ కూడా పెట్టుకున్నాను.. అది నిజమే.. అయితే రకరకాల మనస్తత్వాలు ఉన్న వ్యక్తులతో జీవితం ఎప్పుడూ ఆనందంగా ఉండదు అంటూ ఉంటారు ..అది నిజమని నాకు లేటుగా అర్థమైంది “.
“పెళ్లి అనేది ఒక బాధ్యత ..అది నా వల్ల కాదు అనే అనుమానం నాకు ఓ దశలో వచ్చింది . ప్రెసెంట్ నన్ను నేను ప్రేమించుకోవడమే నేర్చుకున్నాను .. సెల్ఫ్ లవ్ అనేది చాలా ఇంపార్టెంట్ అద్భుతంగా కూడా ఉంటుంది . ఒకరి కోసం జీవించడం కన్నా మనకోసం మనం జీవించినప్పుడే జీవితానికి ఓ అర్థం ఉంటుంది” అంటూ చెప్పుకొచ్చింది . త్రిష మాటలు చూస్తుంటే జన్మలో పెళ్లి చేసుకోదేమో అంటున్నారు జనాలు..!!