Moviesఆ పాన్ ఇండియా హీరోతో తేజ సజ్జ మల్టీస్టారర్ మూవీ ఫిక్స్.....

ఆ పాన్ ఇండియా హీరోతో తేజ సజ్జ మల్టీస్టారర్ మూవీ ఫిక్స్.. ఇది కదా తెలుగోడి సత్తా అంటే..నువ్వు కేక రా అబ్బాయ్..!

తేజ సజ్జ.. ప్రెసెంట్ ఈ పేరు సినిమా ఇండస్ట్రీలో ఎలా మారుమ్రోగిపోతుందో మనం చూస్తూనే ఉన్నాం . ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి ఇప్పుడు హీరోగా తన కెరియర్ను ముందుకు తీసుకెళుతున్న తేజ రీసెంట్గా నటించిన సినిమా హనుమాన్. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది .

అంతేకాదు ఈ సినిమా 287 కోట్లు కలెక్ట్ చేసి కనీ విని ఎరుగని రికార్డులు క్రియేట్ చేసింది. కాగా ఈ సినిమా తర్వాత తేజ సజ్జ ఎవరు డైరెక్షన్ లో నటించబోతున్నాడు..?? అంటూ అందరికీ క్యూరియాసిటీ పెరిగిపోయింది . అందుతున్న సమాచారం ప్రకారం త్రినాధ్ రావు నక్కిన దర్శకత్వంలో తేజ సజ్జ నటించబోతున్నట్లు తెలుస్తుంది. అంతేకాదు ఇది మల్టీ స్టార్ మూవీగా తెరకెక్కబోతుందట .

ఈ సినిమాలో పాన్ ఇండియా హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న రవితేజ కూడా నటించబోతున్నాడట . ఈ సినిమా ఖచ్చితంగా మాస్ అభిమానులను ఓ రేంజ్ లో ఆకట్టుకుంటుంది అంటూ ప్రచారం చేస్తున్నారు జనాలు. అంతేకాదు నిజమైన తెలుగోడి సత్తా అంటే ఇదే అంటూ తేజా సజ్జను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ప్రజెంట్ రవితేజ నటించిన ఈగల్ సినిమా ఫిబ్రవరి 9న రిలీజ్ కాబోతుంది . ఈ సినిమాలో హీరోయిన్ గా అనుపమ పరమేశ్వరన్ నటించింది. ఈ సినిమాపై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి . చూద్దాం మరి ఈ సినిమాతో రవితేజ ఎలాంటి హిట్ అందుకుంటాడో..??

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news