సమంత .. సినిమా ఇండస్ట్రీలో ఓ టాప్ హీరోయిన్ ..కాదు కాదు బడా హీరోయిన్. ఎటువంటి పాత్రలు అయినా అవలీలగా నటించగలిగే సత్తా ఉన్న హీరోయిన్ . ఒకటా రెండా సమంత గురించి చెప్పుకుంటూ పోతూ ఉంటే ఎన్నో. ఏం మాయ చేసావే సినిమా ద్వారా సినిమా ఇండస్ట్రీని షేక్ చేసి పడేసిన సమంత.. ఆ తర్వాత తనదైన స్టైల్ లో పలు సినిమాల్లో నటిస్తూ క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది .
కాగా హీరోయిన్ సమంత – నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకుంది . ఆ తర్వాత డివర్స్ తీసుకునింది . అప్పటినుంచి తెలుగు హీరోలు సమంత విషయంలో గోడమీద పిల్లిలా వ్యవహరించడం మొదలుపెట్టారు . ఆమెకు అవకాశాలు ఇవ్వాలా..? వద్దా..? అంటూ తర్జనభర్జనలో నలిగిపోయారు . చాలామంది ఆమెకు అవకాశాలు ఇవ్వకుండానే దాటేశారు . అయితే అప్పుడు సమంత ఆ విషయాలను లైట్‌గా తీసుకుంది . ఇప్పుడు సమంత ఆ విషయాలపై రివేంజ్ తీర్చుకుంటుంది అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది.
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆమెకు ఆఫర్లు వస్తున్న సరే బడా హీరో సినిమాలను మాత్రం రిజెక్ట్ చేస్తుందట. పెద్దపెద్ద హీరో సినిమాలను సమంత రిజెక్ట్ చేయడం వెనక ఉన్న కారణం ఇదే అంటున్నారు అభిమానులు . గతంలో ఆమె పట్ల వాళ్లు బిహేవ్ చేసిన పద్ధతి .. విడాకులు తీసుకున్న తర్వాత ఎవరు కూడా ఆమెకు సపోర్ట్ చేయకపోవడం .. ఆమె మనసుకు హర్టింగా అనిపించిందని.. అందుకే ఇప్పుడు వాళ్ళ సినిమాల్లో నటించడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు అని …సమంత రేంజ్ ఇప్పుడు హాలీవుడ్ స్థాయిలో ఎదిగిపోయింది అని.. అలాంటి సమంత తెలుగు హీరోని రిజెక్ట్ చేస్తే కచ్చితంగా అది వాళ్లకు అవమానమే అని .. సమంత టైం చూసి భలే కొడుతుంది అని ఫ్యాన్స్ సమంతకు సపోర్ట్ చేస్తున్నారు..!!