ప్రదీప్ .. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫిమేల్ యాంకర్స్ రాజ్యమేలేస్తున్న మూమెంట్లో మేల్ యాంకర్ గా తనదైన స్టైల్ లో సత్తా చాటాడు . ఎన్నో షోస్ ని తనదైన స్టైల్ లో ముందుకు తీసుకెళ్లాడు . కొన్ని షోస్ ని ఓన్ గా ప్రొడ్యూస్ కూడా చేసుకున్నాడు . అంతేకాదు ప్రదీప్ ఎలాంటి షోస్ నైనా సరే అవలీలగా హ్యాండిల్ చేసేయగలడు. కాంట్రవర్షియల్ షోస్ ని కూడా తనదైన స్టైల్ లో హోస్ట్ చేయడమే ప్రదీప్ టాలెంట్.
అయితే సోషల్ మీడియాలో ఆయనకు ఎంతటి ఫాన్ ఫాలోయింగ్ ఉందో మనకు తెలిసిందే. కాగా ఇప్పుడు ప్రదీప్ పెళ్లి మ్యాటర్ మరోసారి నెట్టింట వైరల్ గా మారింది . పెళ్లి వయసు దాటిపోతున్న సరే ప్రదీప్ ఇంకా ఎందుకు పెళ్లి చేసుకోలేదు అన్న వార్త మరోసారి అభిమానులను టెన్షన్ పెడుతుంది . చాలామంది గతంలో ప్రదీప్ లవ్ ఫెయిల్యూర్ అని .. ఆ అమ్మాయిని మర్చిపోలేక పెళ్లి చేసుకోవడం లేదు అని చెప్పుకొచ్చారు .
అయితే ఆ వార్తలో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ప్రదీప్ కి పెళ్లి పై మొదటి నుంచి ఇంట్రెస్ట్ లేదట . ఆ కారణంగానే ఆయన పెళ్లికి దూరంగా ఉన్నారట . తన తల్లి ఎంత చెప్పినా కూడా ప్రదీప్ పెళ్లి చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు అట. పైగా ఈ మధ్యకాలంలో విడాకులు తీసుకుంటున్న జంటలు ఎక్కువగా చూస్తున్నాడు . అది కూడా ఒక పెద్ద కారణమే ..ప్రదీప్ పెళ్లి చేసుకోకపోవడానికి అంటూ అభిమానులు అభిప్రాయపడుతున్నారు..!!