ప్రభాస్ ..ఆరడుగుల అందగాడు ..అమ్మాయిల కలల రాకుమారుడు.. పెళ్లి వయసు దాటిపోతున్న సరే పెళ్లి గురించి పట్టించుకోకుండా పారిపోతున్న ఓ నాటీ కుర్రాడు.. ప్రభాస్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే . మంచితనానికి మరో మారుపేరు అనే చెప్పాలి . ఒక్క నెగిటివ్ ట్రోలింగ్ లేకుండా ఇండస్ట్రీలో నెట్టుకు వస్తున్న టాప్ హీరో . కాగ ప్రభాస్ ప్రెసెంట్ పలు పాన్ ఇండియా సినిమాలతో బిజీ ముందుకు వెళ్తున్నాడు .
త్వరలోనే హనురాఘవపూడి తో కూడా ఓ సినిమాకి కమిట్ అవ్వబోతున్నాడు అంటూ ప్రచారం జరుగుతుంది . ఇది ఫుల్ టు ఫుల్ లవ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కబోతుందట. ప్రజెంట్ ప్రభాస్ కి సంబంధించిన ఒక న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది . ప్రభాస్ తన సినిమాల్లో కొన్ని సీన్స్ ఉండకూడదు అంటూ డైరెక్టర్ కి కండిషన్స్ పెడతాడట. తన సినిమాలో రేప్ సీన్స్ తను హద్దులు మీరీన రొమాంటిక్ సీన్స్ చేయను అంటూ డైరెక్టర్ కి ముందే చెప్పేస్తాడట .
కొన్ని కొన్ని సినిమాలలో కంటెంట్ డిమాండ్ చేస్తే హీరోలు లిప్ లాక్స్.. బెడ్ సీన్స్.. న్యూడ్ సీన్స్ చేయాల్సి వస్తుంది. అయితే ప్రభాస్ మాత్రం అలాంటి సీన్స్ ఏమన్నా ఉంటే ముందే చేయనని చెప్పేస్తాడట . అమ్మాయిలను అవమానించే అలాంటి సీన్స్ అసలు నా సినిమాలో వద్దనే వద్దు అంటూ తెగేసి మేకర్స్ కు క్లారిటీ గా చెప్పేస్తాడట. ప్రభాస్ కి సంబంధించిన ఈ వార్త ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది..!!