Moviesఅయ్యయ్యో .. ఎన్టీఆర్ టైం ఏంటి ఇంత దరిద్రంగా మారిపోయింది ..?...

అయ్యయ్యో .. ఎన్టీఆర్ టైం ఏంటి ఇంత దరిద్రంగా మారిపోయింది ..? మరో భారీ బొక్క.. ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్..!

ఎస్ ప్రెసెంట్ ఇదే కామెంట్స్ తో ఎన్టీఆర్ ని బాగా ఇబ్బంది పెట్టేస్తున్నారు కొందరు ఆకతాయిలు . కాంట్రవర్షియల్ కంటెంట్ కి వెళ్లకుండా తన పని తాను చూసుకుని నటులల్లో ఎన్టీఆర్ కూడా ఒకరు. తను ఒకరి జోలికి వెళ్ళడు .. తన జోలికి ఒకరు వచ్చినా వదలడు .. చీల్చి చెండాడేస్తాడు .. అది అందరికీ తెలిసిందే . కాగా రీసెంట్గా ఎన్టీఆర్ కి సంబంధించిన ఒక న్యూస్ అభిమానులను తీవ్రంగా బాధపడుతుంది . బాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎన్టీఆర్ ఎంట్రీ ఇవ్వబోతున్న విషయం తెలిసిందే.

ఎంతో ప్రతిష్టాత్మకమైన వార్ 2 ప్రాజెక్టులో ఎన్టీఆర్ కూడా భాగం కాబోతున్నాడు అంటూ అఫీషియల్ ప్రకటన కూడా వచ్చింది. ఆల్రెడీ ఈ సినిమాకి సంబంధించిన కొంత షూటింగ్ జరిగింది . త్వరలోనే ఎన్టీఆర్ పై చిత్రీకరించాల్సిన షూట్ ని ప్రారంభించబోతున్నారు అంటూ వార్తలు వినపడ్డాయి . హృతిక్ – తారక్ ల మధ్య వచ్చేసి సీన్స్ గూస్ బంప్స్.. మోత మోగించేస్తుంది అంటూ ప్రచారం జరిగింది . బాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేసేస్తాడు ఎన్టీఆర్ అంటూ అభిమానులు సైతం ఆశపడ్డారు . ఈ సినిమాలో నెగిటివ్ పాత్రలో కనిపిస్తూ ఉండడం ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి కూడా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది.

రేపో మాపో షూటింగ్.. ఎన్టీఆర్ ముంబైకి బయలుదేరాలి అనుకుంటున్నా టైం లో వార్ 2 షూటింగ్ ఆగిపోయింది . త్వరలోనే హృతిక్ రోషన్ వార్ 2 షూట్లో పాల్గొనాల్సి ఉంది. కానీ ఇంతలోనే ఆయన కాళ్ళకి ఆయన గాయం కారణంగా ఆయన షూట్ నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. హృతిక్ రోషన్ తాజాగా తన సోషల్ మీడియాలో నడుముకి బెల్ట్ చేతి కర్ర సహాయంతో నిల్చోని ఉన్న ఫోటో షేర్ చేశాడు . కాళ్ళకి నడుముకి గాయం అయినట్లు తెలుస్తుంది . యాక్షన్ సీక్వెన్స్ వల్లే జరిగిందా..? లేకపోతే ఏదైనా యాక్సిడెంట్ అన్నది క్లారిటీ లేదు. అయితే వార్ 2 మాత్రం పోస్ట్ పోన్ అయ్యింది. అసలే ఎన్టీఆర్ ని ఎప్పుడెప్పుడు థియేటర్స్ లో చూద్దామా అని అభిమానులు వెయిట్ చేస్తుంటే.. ఒకపక్క దేవర సినిమా పోస్ట్ పోవడం ఇంకొకపక్క వార్ 2 షూటింగ్ పోస్ట్ పోన్ అవ్వడం.. ప్రశాంత్ నిల్ సినిమా వెనక్కి వెళ్లిపోవడం అభిమానులకి గజిబిజి గందరగోళంగా అనిపిస్తుంది. ఎన్టీఆర్ టైం అసలు బాగోలేదు అంటున్నారు జనాలు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news