సుహానీ భట్నాగర్..బాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న చిన్నారి . తనదైన స్టైల్ లో సినిమాల్లో నటించి క్రేజీ పాపులారిటీ దక్కించుకుంది . అమీర్ ఖాన్ నటించిన దంగల్ సినిమాలో వన్ ఆఫ్ ద బెస్ట్ క్యారెక్టర్ లో కనిపించి మెప్పించి అభిమానులు చేత శభాష్ అనిపించుకుంది . పెద్దయ్యాక ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ అవ్వడం పక్క అని ఆమెకు ఎంతో భవిష్యత్తు ఉంది అని పలువురు స్టార్స్ కూడా స్టేజి పై పొగడేసారు . అయితే చిన్న వయసులోనే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది ఈ చిన్నారి .
అతి చిన్న వయసులోనే మరణించడంతో దేశవ్యాప్తంగా ఉన్న అభిమానులు చింతించారు. ఆమె మృతి పట్ల రకరకాల వార్తలు వైరల్ అయ్యాయి. కొందరు ఆమెకి హెల్త్ బాగోలేదు అంటుంటే మరికొందరు ఆమె పర్సనల్ లైఫ్ పై అటాక్ చేస్తూ దారుణంగా మాట్లాడారు . రీసెంట్గా సుహాన్ని మృతి పట్ల తల్లి పూజ మీడియాతో మాట్లాడారు . సోషల్ మీడియాలో వైరల్ అయ్యే కొన్ని అబద్ధపు వార్తలను కొట్టి పడేశారు.
“సుహాని తనకున్న పర్సనల్ ప్రాబ్లం కారణంగానే ఇబ్బంది పడుతూ వచ్చింది అని ..మేము ఎవరికీ చెప్పలేదు అని ..దేవుడు ఆమెను తీసుకెళ్లిపోయాడు అని బాధపడిపోయింది. సుహానికి అమీర్ ఖాన్ చాలా సపోర్ట్ గా నిలిచారు అని .. అలాంటి ఆయనకు కూడా మేము తెలుపలేదు అంటూ నిజాన్ని బయటపెట్టింది . అది చర్మవ్యాధి అనుకున్నామని అందువల్లే చాలామంది డెర్మటాలజిస్టులు కలిసామని..అయితే డాక్టర్స్ కూడా ఈ వ్యాధికి ట్రీట్మెంట్ లేదు అని చెప్పడంతో షాక్ అయ్యామని చెప్పుకొచ్చింది . ఆమె శరీరం ఎక్కువగా ఇన్ఫెక్షన్ కి గురి కావడంతో ఊపిరి తీసుకోవడం ఇబ్బందిగా మారింది అని ..ఆ కారణంగానే నా కూతురు ప్రాణాలు విడిచింది అని చెప్పుకొచ్చింది. సుహాని మరణం మాకు బాధాకరమని కన్నీరు మున్నీరుగా విలపించింది”..!!