Moviesచరణ్ - ఎన్టీఆర్ - ప్రభాస్ ల కాంబోలో మిస్సయిన బిగ్...

చరణ్ – ఎన్టీఆర్ – ప్రభాస్ ల కాంబోలో మిస్సయిన బిగ్ బడా మల్టీస్టారర్ మూవీ ఏంటో తెలుసా..? సెట్ అయ్యుంటే రచ్చ రంబోలానే..!!

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో మల్టీ స్టార్లర్ ట్రెండ్ ఎక్కువగా చూస్తున్నాం. మరీ ముఖ్యంగా బడాబడా డైరెక్టర్స్ కూడా మల్టీస్టారర్ సినిమాలను తెరకెక్కించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే స్టార్ హీరోలు కూడా ఒకరి సినిమా కోసం ఒకరు వర్క్ చేయడానికి ఓకే చెప్తున్నారు . తెలుగు ఇండస్ట్రీలో బిగ్ బడా మల్టీస్టారర్ మూవీగా తెరకెక్కిన సినిమా ఆర్ఆర్ఆర్ . రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఎన్ని రికార్డులను బద్దలు కొట్టిందో మనకు తెలిసిందే.

అయితే ఈ సినిమాలో చరణ్ ఎన్టీఆర్ లతో పాటు ప్రభాస్ ని కూడా ఒక గెస్ట్ పాత్రకు అనుకున్నాడట రాజమౌళి . అయితే ప్రభాస్ ని గెస్ట్ పాత్రలో చూపిస్తే ఫ్యాన్స్ ఎక్కడ మళ్లీ హర్ట్ అవుతారో.. సినిమాకి నెగిటివ్ పబ్లిసిటీ వస్తుందో ..?? అన్న భయంతో ఆయన ఆ పాత్రను సినిమా నుంచే తీసేసాడట . ఆర్ఆర్ఆర్ సినిమాలో ప్రభాస్ గెస్ట్ పాత్ర కాకుండా ఇంకొంచెం ఏదైనా ఇంపార్టెంట్ పాత్ర చేసి ఉంటే మాత్రం సినిమా మరింత స్థాయిలో హిట్ అయి ఉండేది అని చెప్పడంలో సందేహం లేదు .

మంచి ఛాన్స్ మిస్ చేసేసుకున్నాడు రాజమౌళి. ప్రజెంట్ రాజమౌళి టాలీవుడ్ సూపర్ స్టార్ హీరో మహేష్ బాబుతో ఒక సినిమాను తెరకెక్కించడానికి సర్వం సిద్ధం చేసుకుంటున్నాడు. ఈ సినిమా బిగ్ అడ్వెంచర్స్ మూవీ గా తెరకెక్కబోతుందట. ఈ సినిమా కోసం స్పెషల్ డైట్ ని కూడా ఫాలో అవుతున్నాడు మహేశ్ బాబు. ప్రసెంట్ మహేశ్ బాబు జర్మనీలో ఉన్నాడు. త్వరలోనే రాజమౌళి సినిమా తో సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లబోతున్నాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news