Moviesఆ విషయంలో వెక్కి వెక్కి ఏడుస్తున్న మృణాల్ ఠాకూర్.. పాపం ఎంత...

ఆ విషయంలో వెక్కి వెక్కి ఏడుస్తున్న మృణాల్ ఠాకూర్.. పాపం ఎంత కష్టం వచ్చిందో..సో శాడ్..!

మృణాల్ ఠాకూర్.. ఈ పేరుకి ప్రత్యేకంగా పరిచయాలు చేయాల్సిన అవసరమే లేదు . సీతారామం సినిమా ద్వారా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ఇండస్ట్రీలో ఒక క్రేజీ రికార్డును నెలకొల్పింది. ఆ తర్వాత నాని సరసన హాయ్ నాన్న సినిమాలో నటించి తనలోని మరో యాంగిల్ ను బయటపెట్టింది . ఒకటి కాదు రెండు కాదు ఇప్పుడు చేతిలో ఏకంగా ఆరు ప్రాజెక్టులు పెట్టుకొని బిజీబిజీగా ముందుకెళ్తుంది.

రీసెంట్గా మృణాల్ ఠాకూర్ కి జరిగిన ఘోర అవమానం గురించి బయట పెట్టింది . బాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ అవార్డు వేడుకకు హాజరైన మృణాల్ ఠాకూర్ అక్కడ చాలా ఇబ్బంది పడిందట . అదే విషయాన్ని ఓపెన్ గా చెప్పుకొచ్చింది . మృణాల్ ఠాకూర్ ను ఇంటర్వ్యూ చేస్తూ ఉండగా అక్కడికి ఒక పెద్ద బడా హీరో కొడుకు వచ్చాడట . వెంటనే మీడియా వాళ్ళు మృణాల్ తో చేస్తున్న ఇంటర్వ్యూ ని ఆపేసి పరుగు పరుగున ఆ సెలబ్రిటీ వద్దకు వెళ్లారట .

ఇదే విషయంపై ఆమె మండిపడింది . “నెపోటిజం అంటూ స్టార్ కిడ్స్ ని బ్లేమ్ చేయడం కాదు .. మనం చేస్తున్న పద్ధతులు పనులు కూడా మార్చుకోవాలి ..నెపోటిజం అంటూ స్టార్ కిడ్స్ ని చాలామంది ట్రోల్ చేస్తున్నారు.. నిజానికి వాళ్లది తప్పు కాదు సెలబ్రిటీస్ గురించి తెలుసుకోవాలని జనాలు ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు ..అందుకే మీడియా వాళ్ళు వాళ్ళ కోసం ఎగబడి పోతూ ఉంటారు.. కష్టపడి పైకి వచ్చిన వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వరు”.. అంటూ తన బాధను మొత్తం కక్కేసింది ప్రెసెంట్ మృణాల్ మాట్లాడిన మాటలు నెట్టింట వైరల్ గా మారాయి. గతంలో నాచురల్ స్టార్ నాని కూడా నెపోటిజంపై ఇలాంటి కామెంట్స్ చేయడం గమనార్హం..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news