సినిమా ఇండస్ట్రీలో దర్శక ధీరుడుగా చెరగని ముద్రను వేసుకున్న రాజమౌళి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే . శాంతినివాసం అనే సీరియల్ తీసి మంచి గుర్తింపు సంపాదించుకున్న జక్కన్న ఆ తరువాత తనదైన స్టైల్ లో ఎన్నెన్నో సినిమాలను తెరకెక్కించి తెలుగు ఇండస్ట్రీ ఖ్యాతిని ప్రపంచ దేశాలకు పాకేలా చేశాడు. మరి ముఖ్యంగా ఎన్టీఆర్ స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా ఆయనకు మంచి సక్సెస్ ఇచ్చిందని చెప్పాలి . అంతేకాదు ఇప్పటివరకు రాజమౌళి తెరకెక్కించిన సినిమాలు ఒక్కటంటే ఒక్కటి కూడా ఫ్లాప్ కాలేదు . అన్నీ కూడా ఇండస్ట్రీ ర రికార్డులను బద్దలు కొట్టే విధంగానే హిట్ అయ్యాయి .
అయితే చాలామంది రాజమౌళి తెరకెక్కించిన సినిమాలలో ది ఫేవరెట్ ఏంటి అంటే అన్ని అని చెప్పుకొస్తారు. మరి ఇష్టం లేని సినిమా అంటే జీరో అని చెప్తారు. అయితే వాళ్ళ భార్య మాత్రం సంచలన కామెంట్స్ చేసింది . రాజమౌళి సక్సెస్ లో తన భార్య కీలకపాత్ర పోషించింది అని చెప్పడంలో సందేహం లేదు. ఆయన తీసిన సినిమాలలో రమా రాజమౌళికి నచ్చని సినిమా ఏదైనా ఉంది అంటే రెండే రెండు అంటూ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకు వచ్చింది.
“స్టూడెంట్ నెంబర్ వన్ , యమదొంగ” సినిమాలు. రాజమౌళి ఇంకా బాగా తెరకెక్కించి ఉండొచ్చు అని ..ఎందుకో కొన్నిసార్లు ఆ సినిమాలు చూస్తుంటే బోర్ కొట్టినట్లు అనిపిస్తాయని.. గతంలో ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడిన మాటలు అప్పట్లో పెను సంచలనాన్ని సృష్టించాయి. రెండూ కూడా ఎన్టీఆర్ నటించిన సినిమాలే కావడం ఎన్టీఆర్ అభిమానులకు తీవ్రమైన అసంతృప్తిని మిగిల్చింది. అయితే ఈ విషయాన్ని కూడా ఎన్టీఆర్ ఫ్యాన్స్ చాలా లైట్ గా తీసుకున్నారు. ప్రజెంట్ రాజమౌళి – మహేష్ బాబు తో పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నాడు . ఈ సినిమాతో మరో ఆస్కార్ అవార్డ్ ఇండియాకి రావడం పక్కా అంటున్నారు అభిమానులు..!!