మెగా కోడలు ఉపాసన పేరు ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో మారుమ్రోగిపోతుంది. ఉపాసన .. రాంచరణ్ భార్యగా అపోలో హాస్పిటల్స్ బాధ్యతలు నిర్వహిస్తున్న వ్యక్తిగా అపోలో హాస్పిటల్స్ చైర్మన్ ప్రతాపరెడ్డి మనవరాలుగా బాగా సుపరిచితురాలు . అన్నిటికంటే ఉపాసన మంచి మనసు గల అమ్మాయి అందరిని చక్కగా పలకరిస్తుంది. అందరితో చక్కగా బిహేవ్ చేస్తుంది . కల్మషం లేని అమ్మాయి అంటూ చాలామంది సామాన్య జనాలు కూడా ఆమెను పొగిడేస్తూ ఉంటారు .
ఉపాసన ఎప్పుడూ కూడా నమ్మకంగా నిజాయితీగా ఉంటుంది. ఎవరి పట్ల దురుసుగా మాట్లాడదు. ఆ విషయం అందరికీ తెలిసిందే. రీసెంట్గా తన తాతగారు పుట్టినరోజు సందర్భంగా ఉపాసన ” ది అపోలో స్టోరీ” అంటూ ఒక బుక్ ని లాంచ్ చేశారు. ఈ బుక్ లో అపోలో హాస్పిటల్స్ ఎలా స్టార్ట్ అయింది ..? ఎలా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ పైకి వచ్చారు..? అనే విషయాలను క్లియర్గా రాసుకొచ్చారు .అంతేకాదు ఈ పుస్తకం ప్రతి తండ్రి చదవాలి అంటూ ఉపాసన స్పెషల్గా మెన్షన్ చేసింది .
తన తాతగారు తన కూతుర్లు పట్ల ఎలా బిహేవ్ చేశారు.. వాళ్ల కెరియర్ లో సక్సెస్ అవ్వడానికి ఆయన పాత్ర ఏంటి అనేది ..ఈ పుస్తకంలో క్లియర్గా రాసుకొచ్చారు అని .. ప్రతి తండ్రి చదివి తన కూతురి పట్ల అంతే ప్రేమగా ఉండాలి అని చెప్పుకొచ్చింది . అంతేకాదు మీడియా సమావేశంలో ఉండగా రిపోర్టర్స్ :మీ తాతగారు బయోపిక్ ను ఎక్స్పెక్ట్ చేయొచ్చా..?” అంటూ ప్రశ్నించగా..” కచ్చితంగా త్వరలోనే అది కూడా వస్తుంది “అంటూ లైవ్ లోనే అఫీషియల్ గా ప్రకటన చేసేసింది .
అంతేకాదు ఉపాసన ను రిపోర్టర్స్ ప్రశ్నిస్తూ ..”మరి ఈ పిక్చర్లో మేము రాంచరణ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా..?” అని అడగ్గా ..”అది డైరెక్టర్ బట్టి ఉంటుంది ” అంటూ చెప్పుకు వచ్చింది . ఇలా లైవ్ లోనే ఉపాసన తన తాత గారి బయోపిక్ తెరకెక్కిస్తాను అని చెప్పడం అభిమానులకి షాకింగ్ అనిపిస్తుంది. ఎందుకంటే ఉపాసనకి సినిమాలు అంటే ఇంట్రెస్ట్ లేదు .. కానీ తాతగారు బయోపిక్ గురించి అడగ్గానే వెంటనే టక్కున సమాధానం చెప్పడం ఆమెకు తన తాతగారి పట్ల ఉన్న ప్రేమకు నిదర్శనం అంటున్నారు అభిమానులు..!!