Movies"ఆ పూనం పాండే నిజంగా చచ్చినా బాగుండేది".. హీట్ పెంచేస్తున్న స్టార్...

“ఆ పూనం పాండే నిజంగా చచ్చినా బాగుండేది”.. హీట్ పెంచేస్తున్న స్టార్ హీరోయిన్ కామెంట్స్..!

పూనం పాండే .. గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో ఈ పేరు ఏ రేంజ్ లో మారుమ్రోగిపోతుందో మనకు తెలిసిందే. బాలీవుడ్ బ్యూటీ పూనమ్ పాండే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు . పలు బోల్డ్ రోల్స్ లో కుర్రాళ్ళకి చెమటలు పట్టిస్తుంది . రీసెంట్గా ఆమె చనిపోయినట్లు వార్త వైరల్ అయింది . పూనం పాండే సర్వికల్ క్యాన్సర్ ద్వారా మరణించినట్లు దేశవ్యాప్తంగా వార్తలు వైరల్ అయ్యాయి . దీంతో ఒక్కసారిగా ఆమె అభిమానులు కన్నీరు మున్నీరుగా వినిపించారు. సీన్ కట్ చేస్తే .. ఇదంతా పూనం పాండే ఆడిన గేమ్ అంటూ బయటపడింది . పలువురు స్టార్ సెలబ్రిటీస్ కూడా పూనం మరణం పై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు .

సోషల్ మీడియా వేదికగా పలు పోస్ట్లు ట్రెండ్ చేశారు . మరుసటి రోజు పూనం పాండే తాను చనిపోలేదు అని ఓ వీడియో రిలీజ్ చేసి అభిమానులకు షాక్ ఇచ్చింది . “నేను బ్రతికే ఉన్నాను డోంట్ వర్రీ కేవలం గర్భాశయ క్యాన్సర్ గురించి అవగాహన కల్పించేందుకు ఇలా చేశాను “అంటూ క్లారిటీ ఇచ్చింది . దీంతో ఆమెపై దేశ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు . బుద్ధున్న వాళ్ళు ఎవరైనా ఇలా చేస్తారా..? అంటూ మండిపడ్డారు . మరికొందరు పిచ్చెక్కింది ..? అంటూ తిట్టిపోశారు . నకిలీ వార్తలను స్ప్రెడ్ చేసినందుకుగాను పూనంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు .

అయితే పలువురు సినీ యాక్టర్స్ లు కూడా ఆమెపై మండిపడుతున్నారు . కస్తూరి శంకర్ పూనం పోస్ట్ పై షాకింగ్ కామెంట్స్ చేసింది . “ఆమె వయసు 32 సంవత్సరాలు అనుకున్నప్పుడే.. నాకు అర్థమైంది అది ఫేక్ అని ..కేవలం పబ్లిసిటీ కోసమే ఇలా చేసింది అని ..ప్రజలు వెర్రి ముఖం వాళ్ళు కాదు ..ప్రజలకు అన్నీ తెలుసు.. సర్వైకల్ క్యాన్సర్ గురించి పూర్తిగా అవగాహన ఉంది ..పూనం కేవలం పబ్లిసిటీ కోసమే ఇలా చేసింది .. క్యాన్సర్ జబ్బును ఇలా పబ్లిసిటీ స్టంట్ కోసం ఉపయోగించుకోవడం సిగ్గుచేటు ” అంటూ ఘాటుగా స్పందించింది . ఆమె మాటలు వైరల్ అవుతున్నాయి . మరికొందరు పూనమ్ పాండే నిజంగా చచ్చిపోయి ఉన్న బాగుండేది అని ఇలా ఫేక్ వార్తలతో పాపులారిటీ సంపాదించుకోవడం అస్సలు బాగోలేదని మండిపడుతున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news