“ఓయ్”.. ఈ సినిమా గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే . ఆనంద్ రంగా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఫీల్ గుడ్ లవ్ స్టోరీ అని చెప్పాలి . ప్రేమికుల రోజు సందర్భంగా ఈ సినిమా మళ్లీ రిలీజ్ అవుతుంది . సిద్ధార్ధ్ హీరోగా.. షామిలీ హీరోయిన్గా నటించిన ఈ సినిమా అభిమానులను బాగా ఆకట్టుకుంది. కమర్షియల్ హిట్ అని చెప్పలేము కానీ కూల్ అండ్ క్లాసిక్ లవ్ స్టోరీ గా అభిమానుల మనసుల్లో నిలిచిపోయింది . ఓయ్ చిత్రం పెద్దగా బ్లాక్బస్టర్ కాకపోయినా లవర్స్ డే సందర్భంగా మళ్లీ థియేటర్స్ లో రిలీజ్ చేశారు .
ఈ క్రమంలోని 15 ఏళ్ల కిందట జరిగిన ఓ విషయాన్ని బయటపెట్టాడు డైరెక్టర్ ఆనంద్ రంగా. నిజానికి ఓయ్ సినిమాకి ముందుగా పరుగు అనే టైటిల్ ని పెట్టుకున్నారట . కానీ అప్పటికే ఆ టైటిల్ తో బన్నీ చిత్రం వచ్చేసింది . బన్నీ చిత్రం ఆ టైటిల్ రిజిస్ట్రేషన్ చేయించుకునేసింది. ఈ క్రమంలోనే ఈ సినిమాకి ఏ పేరు పెడదామా అంటూ చాలా ఆలోచించారట డైరెక్టర్. సంధ్య ఈ సినిమాలో హీరోయిన్ పేరు హీరో పేరు ఉదయ్ . ఎక్కువగా సంధ్య ..ఉదయ్ అని కాకుండా ఓయ్ అంటూనే పిలుస్తూ ఉంటుంది .
ఇది మన ఇళ్లల్లో చాలా మంది భర్తలను పిలుస్తూనే ఉంటారు . కొందరు లవర్స్ ముద్దుగా పిలుచుకుంటూ ఉంటారు . కాగా ఈ సినిమా మొత్తం ఒక సంవత్సరంలో పూర్తయిపోతుంది . 1 జనవరి 2017న ఉదయ్ – సంధ్యా లవ్ స్టోరీ స్టార్ట్ అవుతుంది . అదేవిధంగా 2008 జనవరి 1న ఈ సినిమా స్టోరీ ఎండ్ అయిపోతుంది . అదేరోజు ఆమె మరణిస్తుంది . దీంతో సినిమాకి ఎండ్ కార్డ్ పడిపోతుంది. ఈ సినిమాకి ఏ పేరు పెట్టాలా అని ఆలోచిస్తూ ఉండగా డైరెక్టర్ కి అద్భుతమైన ధాట్ వచ్చింది. One Year-OY ఫస్ట్ అక్షరాలను తీసుకొని టైటిల్ గా ఫిక్స్ చేశారట . ఇదే విషయాన్ని డైరెక్టర్ ఆనంద్ రంగా వెల్లడించారు . సోషల్ మీడియాలో ప్రెసెంట్ ఇదే న్యూస్ వైరల్ అవుతుంది. భలే టాలెంట్ ఉంది నీలో మరి ఎందుకు సినిమాలు చేయడం లేదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు జనాలు..!!