ప్రముఖ నిర్మాత వడ్డే రమేశ్ కొడుకుగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు వడ్డే నవీన్. ఇండస్ట్రీలో వారసత్వం అనేది కొంత వరకే కలిసొస్తుంది. కెరీర్ స్టార్టింగ్‌లో కొన్ని సినిమాలతో పాటు పునాది కోసమే వారసత్వం ఉంటుంది. ఆ తర్వాత ఎంత గొప్ప వారసత్వం ఉన్నా కూడా టాలెంట్ లేకపోతే కెరీర్ పరంగా వెనకపడిపోవాల్సిందే. వడ్డే రమేశ్ కూడా తన కొడుకు నవీన్‌ను సొంత బ్యానర్లో హీరోగా లాంచ్ చేచశారు.
ఆయన హీరోగా నటించిన తొలి సినిమా క్రాంతి. ఆ తర్వాత కొరుకున్న ప్రియుడు, పెళ్లి లాంటి సూపర్ హిట్లతో మంచి గుర్తింపే తెచ్చుకున్నాడు. ఆ టైంలో వడ్డే నవీన్ ఏజ్ గ్రూప్‌లో తొట్టెంపూడి వేణు మాత్రమే ఉండేవారు. అప్పటికే హీరోలుగా ఎస్టాబ్లిష్ అయిన జగపతి బాబు, శ్రీకాంత్, జేడీ చక్రవర్తి లాంటి వాళ్లకు నవీన్ కొంత పోటీని ఇచ్చారు.
ఇక చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేశ్ లాంటి వారు ఎలాగూ ఉన్నా నవీన్‌కు కూడా టాలీవుడ్‌లో మంచి స్పేసే దొరికింది. ఆ తర్వాత కొన్ని హిట్లు కూడా పడ్డాయి. మనసిచ్చిచూడు, స్నేహితులు, చాలాబావుంది, బాగున్నారా, మా ఆవిడ మీదొట్టు మీ ఆవిడ చాలామంచిది లాంటి బ్లాక్ బస్టర్లు కూడా అతడి కెరీర్‌లో ఉన్నాయి. కొన్ని యావరేజ్ హిట్స్ కూడా పడ్డాయి. మిగిలిన హీరోల పోటీ కండే వడ్డే నవీన్‌కు డ్యాన్సులు, ఫైట్లు పెద్దగా వచ్చేవే కావు.
మాస్ ఆడియెన్స్‌కు కావాల్సినవి అవే. మాస్‌కు నవీన్ ఎక్కకపోవడం కొన్ని ప్లాపులు పడడం, మార్కెట్ డౌన్ అవ్వడంతో నవీన్‌కు ఛాన్సులు తగ్గాయి. ఆ తర్వాత కొందరు నిర్మాతలు ముందుగా నవీన్‌తో సినిమాలు చేస్తామని అడ్వాన్స్‌లు, అగ్రిమెంట్లు చేసుకున్నాక కూడా వెనక్కు తగ్గారు. అలా నవీన్ టాలీవుడ్‌లో ఫేడవుట్ అయిపోయాడు. ఇక ఇప్పుడు నవీన్‌కు మంచి క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎవరైనా ఛాన్సులు ఇస్తారేమో ? చూడాలి.