పూరి జగన్నాథ్ ఈ పేరు చెపితేనే టాలీవుడ్లో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్‌గా మనకు గుర్తుకు వస్తారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బ్లాక్‌బస్టర్ సినిమా బద్రితో పూరి మెగాఫోన్ పట్టి దర్శకుడిగా పరిచయం అయ్యారు. 2000లో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్. ఆ తర్వాత పూరికి ఎదురు లేకుండా పోయింది. టాలీవుడ్లో అందరు స్టార్ హీరోలు, సీనియర్ హీరోలతో సినిమాలు చేసి హిట్లు కొట్టాడు. గత కొంత కాలంగా పూరి సరైన ఫామ్‌లో ఉండడం లేదు. ఒక్క హిట్ వస్తే.. ఐదారు ప్లాపులు పడుతున్నాయి.
ఎన్టీఆర్‌తో టెంపర్ తర్వాత ఆరు వరుస ప్లాపులు ఇచ్చాడు. మళ్లీ రామ్‌తో ఇస్మార్ట్ శంకర్ సూపర్ హిట్.. ఆ వెంటనే విజయ్ దేవరకొండతో పాన్ ఇండియా ప్రాజెక్ట్ లైగర్ డిజాస్టర్. ఇక ఇప్పుడు రామ్‌తో డబుల్ ఇస్మార్ట్ అంటూ సీక్వెల్ నడిపిస్తున్నాడు. పూరి సినిమాల్లో హీరోయిన్లకు ఎప్పుడూ స్పెషాలిటీ ఉంటుంది. హీరోయిన్లను పూరి ఎంత అందంగా.. ఎంత హాట్‌గా చూపిస్తాడో చెప్పక్కర్లేదు.
పూరి కథ రాసుకునేటప్పుడే హీరోయిన్ పాత్రకు మంచి ప్రాధాన్యం ఉండేలా చూస్తాడు. పూరి పరిచయం చేసిన అనుష్క లాంటి వాళ్లే దశాబ్దాల పాటు స్టార్ హీరోయిన్గా ఇండస్ట్రీలో కంటిన్యూ అవుతున్నారు. ఇక పూరి సినిమాల్లో ఐటెం సాంగ్స్ ఎంతలా హాట్‌గా ఉంటాయో.. అందులో డ్యాన్సులు చేసే అమ్మాయిలు ఎలా పాపులర్ అవుతారో చెప్పక్కర్లేదు. పూరి ఐటెం సాంగ్స్‌లో ఎక్కువుగా మాట్లాడుకోవాల్సింది నోరా ఫతేహి, మొమైత్ ఖాన్ గురించే.
పూరి తమ్ముడు సాయిరాం శంకర్‌ను హీరోగా పరిచయం చేస్తూ తీసిన 143 సినిమాలో పాప్ సింగర్ కం డ్యాన్సర్ మమైత్‌ఖాన్ ఐటెం సాంగ్‌తో టాలీవుడ్‌కు పరిచయం అయ్యింది. ఈ పాటలో మమైత్ తన డ్రెస్సులను తొడల వరకు కత్తిరించుకుంది. ఐటెం సాంగ్ అంటే ఇలాగే ఉండాలని పూరికే స్వయంగా చెప్పడంతో పూరి దిమ్మతిరిగిపోయింది. మమైత్ పూరికి పిచ్చపిచ్చగా నచ్చేయడంతో వారిద్దరు కలిసి చాలా యేళ్లపాటు జర్నీ చేశారు.
హైదరాబాద్‌లో ఉన్నప్పుడు మమైత్ పూరి ఇంట్లోనే చాలా కాలం ఉండేదట. ఒక్కోసారి షూటింగ్‌లోనే పూరి భార్య ముద్దలు కలిపి స్వయంగా మమైత్ నోట్లో పెట్టేదట. అంత క్లోజ్‌గా ఉన్న పూరి – మమైత్‌ఖాన్ మధ్య మరో హాట్ హీరోయిన్ ఛార్మీ చిచ్చు పెట్టిందని అంటారు. ఛార్మీ ఎప్పుడు అయితే పూరి లైఫ్‌లోకి ఎంటర్ అయ్యిందో.. ఆమె పూరితో కలిసి నిర్మాతగా అవతారం ఎత్తిందో అప్పటి నుంచి మమైత్ – పూరి బంధానికి బీటలు వారుతూ వచ్చాయని టాలీవుడ్ వర్గాలు గుసగుసలాడుకుంటాయి.