ప్రముఖ టెన్నీస్ స్టార్ సానియా మీర్జా- పాక్ క్రికెటర్ షోయబ్ మాలిక్ వైవాహిక జీవితం విచ్ఛిన్నమైంది. దాదాపు 12 ఏళ్ల పాటు కలిసున్న ఈ జంట ఓ బిడ్డకు కూడా జన్మనిచ్చింది. తాజాగా షోయబ్ పాకిస్తాన్‌కు చెందిన బుల్లితెర నటి సనా జావేద్‌ను వివాహం చేసుకోవడంతో గత కొద్ది రోజులుగా వీరిద్దరు విడిపోయారు.. వీరి మధ్య పొసగడం లేదంటూ వచ్చిన వార్తలు నిజం అయ్యాయి. అటు షోయబ్‌కు ఇది మూడో పెళ్లి కాగా.. సనాకు కూడా 2020లో ఓ పెళ్లి జరగగా రెండేళ్ల కాపురం తర్వాత ఆమె తన మొదటి భర్తకు విడాకులు ఇచ్చేసింది.
అయితే వీరిద్దరు విడిపోవడం షోయబ్ కుటుంబ సభ్యులకు కూడా ఇష్టంలేదట. షోయబ్ సోదరికి కూడా సానియాకు విడాకులు ఇవ్వడం ఎంతమాత్రం ఇష్టం లేదని సమాచారం. ఇక గత కొద్ది నెలల క్రిందటే వీరిద్దరు విడిపోయినా ఎట్టకేలకు షోయబ్ పెళ్లి చేసుకున్నట్టు ఫొటోలు బయటకు రావడంతో వీరిద్దరు విడాకులు తీసుకున్న విషయం బయటకు వచ్చింది.
షోయబ్ గత కొంత కాలంగా సనాతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని.. దీంతో పాటు షోయబ్‌కు ఉన్న పలు అక్రమ సంబంధాలు తెలిసే తనను నిర్లక్ష్యం చేస్తున్నాడనే సానియా అతడికి దూరంగా ఉంటోందని… ఈ కారణాలతోనే వీరి మధ్య గ్యాప్ బాగా పెరిగిందని పాక్ మీడియాలో కథనాలు వచ్చాయి. అయితే గత కొంత కాలం నుంచే సానియా విషయంలో ఓ గాసిప్ బాగా వైరల్ అయ్యింది. సానియా టాలీవుడ్‌కే చెందిన ఓ క్రేజీ హీరోతో బాగా క్లోజ్‌గా ఉందని.. అదే టైంలో అటు షోయబ్ కూడా పలువురు అమ్మాయిలతో సంబంధాలు పెట్టుకోవడం ఇవన్నీ… ఇద్దరి మధ్య బాగా గ్యాప్ పెంచేసి విడాకులకు దారి తీశాయంటున్నారు.