ఎస్ ఇప్పుడు టాలీవుడ్‌లో మళ్లీ ఇదే చర్చ జరుగుతోంది. త్రివిక్రమ్ తెరవెనక ఉంటూ పవన్ సినిమాలు సెట్ చేస్తున్నాడు. రీమేక్ కథలు పెట్టుకుని.. వాటిలో కొంత మార్పులు, చేర్పులు చేసి ఓ బుడ్డ డైరెక్టర్‌ను పెట్టి తెరవెనక త్రివిక్రమ్ అంతా తానై నడిపించి సినిమాను చుట్టేస్తున్నాడు. అలా చేసినవే వకీల్‌సాబ్, భీయ్లానాయక్, బ్రో సినిమాలు. ఈ సినిమాల ఫలితాలు అంత గొప్పగా ఏం లేవు. పైగా ఇవన్నీ రీమేక్‌లే.
ఈ సినిమాలు చేసిన డైరెక్టర్లకు వచ్చిన రెమ్యునరేషన్ల కంటే ఈ సినిమాకు తెరవెనక సాయం చేసిన త్రివిక్రమ్ నాలుగైదు రెట్లు ఎక్కువుగా రెమ్యునరేషన్లు అందుకున్న మాట వాస్తవం. పైగా ఈ సినిమాలకు పవన్ కేటాయించిన కాల్షీట్లు కూడా మహా అయితే 25 రోజులకు కాస్త అటూ ఇటూగా ఉంటున్నాయి. ఏ మాత్రం వర్కవుట్ చేయకుండా తీసిన ఈ సినిమాలు పవన్ రేంజ్‌కు తగినట్టుగా సక్సెస్ కాలేదు.
కట్ చేస్తే ఇప్పుడు మళ్లీ పవన్‌ను ఆ డబ్బు మాయలో ముంచేందుకు తాను కూడా తెరవెనక పని చక్క పెట్టి కొంత వెనకేసుకునేందుకు ఇలాంటి ప్రాజెక్టే ఒకటి సెట్ చేస్తున్నట్టు భోగట్టా. త్రివిక్రమ్‌ను మధ్యలో పెట్టి పవన్‌తో ఓ చిన్న సినిమా ప్లాన్ చేస్తోందట జీ గ్రూప్. బ్రో సినిమా తెరముందు ఫీఫుల్స్ మీడియా కనిపించినా.. తెరవెనక ఆ సినిమా ఫండింగ్ అంతా జీ గ్రూప్‌దే అన్న ప్రచారం నడిచింది.
ఇప్పుడు పవన్ కొత్త సినిమా కూడా 25 రోజుల్లో లాగేయాలని జీ గ్రూప్ ప్లాన్ అట. ఇప్పుడు ఈ డీల్ సెట్ చేసే పనిలో పడ్డాడట త్రివిక్రమ్. పవన్ నాలుగు నెలల తర్వాత సెట్స్ మీదకు వచ్చినా ఓజీ, ఆ తర్వాత ఉస్తాద్ భగత్‌సింగ్ ఉన్నాయి. వాటన్నింటిని పక్కన పెట్టి ఇప్పుడు ఈ కొత్త సినిమాకు పవన్ ఓకే చెప్పినా ఆశ్చర్యం లేదు. అంతా త్రివిక్రమ్ మాయ.. ఏదేమైనా పవన్ ఇలా త్రివిక్రమ్ మాయలో పడితే అతడి నుంచి గుర్తుంచుకునే సినిమాలు ఇక చూడలేం.