Moviesటాలీవుడ్ గ‌ప్‌చుప్‌: ఈ ఇద్ద‌రు ముస‌లోళ్లే కానీ... కుర్ర న‌టీమ‌ణుల‌తో బంచిక‌బంచిక‌...!

టాలీవుడ్ గ‌ప్‌చుప్‌: ఈ ఇద్ద‌రు ముస‌లోళ్లే కానీ… కుర్ర న‌టీమ‌ణుల‌తో బంచిక‌బంచిక‌…!

టాలీవుడ్ లో హీరోయిన్లు, నటీమణులు.. ముఖ్యంగా అమ్మాయిల విషయంలో ఆశపడే వాళ్ళు చాలామంది ఉంటారు. ఈ విషయంలో హీరోలు, దర్శకులు, నిర్మాతలు ఇలా చాలామంది అమ్మాయిలను తెరవెనక ఎలా వాడాలో ఆరితేరిపోయి ఉంటారు. తాజాగా టాలీవుడ్ లో ఇద్దరు ముసలి నిర్మాత‌ల‌ విషయంలో హాట్‌ టాపిక్‌గా మారింది. వయసు మీదపడుతున్న నిర్మాత ఒకాయన ఉన్నారు. చింత చచ్చిన పులుపు చావదు అన్నట్టుగా ఆయనకు కోరికలు మామూలుగా లేవు. చాలా వ్యాపారాలు, కావలసినంత డబ్బు ఉంది. అందుకే ఓ చిన్న నటిని తీసుకుని ముంబై వెళ్ళిపోయారు.

ఆ నటి సినిమాలలో కాస్త గుర్తుండే క్యారెక్టర్లే చేస్తూ ఉంటుంది. పైగా విల‌క్షణమైన స్వరంతో జనాలకు గుర్తుండిపోతుంది. ఈ నిర్మాత, ఆ నటి కలిసి ముంబైలో బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఓ సినిమా ప్రమోషన్ కోసం ముంబై వెళ్ళిన టాలీవుడ్ జనాలు వీరిద్దరూ చాలా క్లోజ్ గా ముంబై వీధుల్లో తిరగటం చూసేసారు. వాళ్లు హైద‌రాబాద్ సినీ స‌ర్కిల్స్‌లో టాంటాం వేసేశారు. ఇది టాలీవుడ్‌లో లీక్ అయిపోయింది. ఇక వయస్సు మీద పడిన మరో నిర్మాత ఉన్నారు. ఆయన తరచూ పక్క దేశానికి వెళుతూ ఉంటారు. అక్కడ సేదతీరి వస్తూ ఉంటారు.

తాజాగా నూతన సంవత్సర వేడుకల కోసం అక్కడికి వెళ్లిపోయారట. అసలు ఈ నిర్మాతతో సంబంధం లేకుండా ఓ యువ నటీమణి తనంతట తాను టికెట్ బుక్ చేసుకుని అదే దేశం వెళుతుంది. ఆ నిర్మాత బుక్ చేసుకున్న హోటల్ రూమ్‌లోకి వాలిపోతుంది. అక్కడ ఎంజాయ్ చేస్తారు. మళ్లీ సేమ్ ప్రాసెస్‌లో ఎవరికి వారు తెలియకుండా తిరిగి ఇండియాకు వచ్చేస్తారు. ఇలా చాలా తెలివిగా ఇద్దరు ముసలి నిర్మాతలు అమ్మాయిలతో ఎంజాయ్ చేస్తున్నారన్న హాట్‌ టాపిక్ ఇప్పుడు టాలీవుడ్ లో బాగా వైరల్ అవుతుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news