ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ టైంలోని లేడీ పవర్ స్టార్ గా ట్యాగ్ చేయించుకున్న సాయి పల్లవికి సంబంధించిన ఈ వార్త ఇప్పుడు సినిమా ఇండస్ట్రీని షేక్ చేసి పడేస్తుంది . మనకు తెలిసిందే మలర్ సినిమా ద్వారా మలయాళం ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సాయి పల్లవి తెలుగులో ఫిదా సినిమా ద్వారా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది .
ఆ తర్వాత తనదైన స్టైల్ లో సినిమాలు చేస్తూ లేడీ పవర్ స్టార్ అంటూ ట్యాగ్ చేయించుకుని మరి సోషల్ మీడియాలో హ్యూజ్ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది . కాగా రీసెంట్గా సాయి పల్లవి సిస్టర్ పెళ్లి చేసుకోబోతున్నాను అంటూ తన ఫియాన్సీను పరిచయం చేసింది. అయితే ఇలాంటి క్రమంలోనే అక్క పెళ్లి చేసుకోకుండా చెల్లి పెళ్లి ఏంటి అన్న కామెంట్స్ కూడా వినిపించాయి.
అయితే సాయి పల్లవి లైఫ్ లో పెళ్లి చేసుకోకూడదు అనుకుంటుందట . లైఫ్ లాంగ్ సాయిబాబా భక్తురాలుగా ఉండిపోవాలనుకుంటుందట . తన తల్లిదండ్రులను చూసుకుంటూ ఈ లైఫ్ కి ఇదే అంకితం అంటూ పెళ్లి చేసుకోను అని తన పేరెంట్స్ కు చెప్పుకొస్తుందట . ఇదే న్యూస్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది . దీంతో సాయి పల్లవి అభిమానులకు ఇది గుండెలు బద్దలైపోయే న్యూస్ అంటున్నారు జనాలు..!!