మనకు తెలిసిందే ..సినిమా ఇండస్ట్రీ అంటేనే మాయాలోకం. రంగుల ప్రపంచం . ఎప్పుడూ ఏం జరుగుతుందో ఎవ్వరూ చెప్పలేరు . హీరోయిన్స్ కూడా కొన్నిసార్లు తమకు ఇష్టం లేని పనులు చేయాల్సి వస్తుంది . అలాంటి లిస్టులో చాలామంది ఉన్నారు . కాగా అదే విషయాలను బయటపెట్టింది హీరోయిన్ అంజలి . పేరుకు తెలుగు అమ్మాయి అయినప్పటికీ కోలీవుడ్ లో బాగా పాపులారిటీ సంపాదించుకొని తద్వారా తెలుగులో మళ్లీ అవకాశాలు దక్కించుకున్న అంజలి చాలా బోల్డ్ సినిమాల్లో కూడా నటించింది .
అయితే అవన్నీ ఇష్టపూర్వకంగా చేయలేదు అంటూ క్లారిటీ ఇచ్చింది . ఓ ఇంటర్వ్యూలు అంజలి మాట్లాడుతూ..” సినిమాలో చాలా బోల్డ్ సీన్స్ ఉంటాయి. ముద్దు సీన్స్ ఉంటాయి.. పడకగది సన్నివేశాలు కూడా చేయాల్సి ఉంటుంది ..కథకు అవసరమైనప్పుడు కచ్చితంగా అందులో మనం నటించాల్సి ఉంటుంది.. కాదనలేము ..హీరోలతో ఆ తరహా సన్నివేశాలలో నటించాల్సి వచ్చినప్పుడు ఎవరికైనా సరే ఇబ్బందికరంగా ఉంటుంది.
ఎందుకంటే అలాంటి బోల్డ్ సీన్స్ షూట్ చేసేటప్పుడు ..చుట్టూ జనం టెక్నీషియన్లు .. మిగతా నటీనటులు కూడా ఉంటారు.. వాళ్ళు ఏదేదో అనుకుంటూ ఉంటారు ..కానీ అవన్నీ మనం ఆలోచిస్తే గట్టిగా ఎదగలేము” అంటూ చెప్పుకొచ్చింది . ప్రెసెంట్ హీరోయిన్ అంజలి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అయితే చాలామంది హీరోయిన్స్ ని అలాంటి సన్నివేశాలలో నటించమంటూ బలవంతం చేస్తారని అందుకే పద్ధతి గల హీరోయిన్స్ కూడా అలాంటి సీన్స్ చేస్తున్నారు అని కామెంట్స్ చేస్తున్నారు జనాలు..!!