Moviesప్రభాస్ ‘రాజాసాబ్’ పై IMDB సెన్సేషనల్ కామెంట్స్.. గట్టి కౌంటర్ ఇచ్చిన...

ప్రభాస్ ‘రాజాసాబ్’ పై IMDB సెన్సేషనల్ కామెంట్స్.. గట్టి కౌంటర్ ఇచ్చిన డైరెక్టర్ మారుతీ..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో రెబల్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న ప్రభాస్ .. మారుతీ దర్శకత్వంలో రాజా సాబ్ అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఎప్పుడో షూటింగ్ మొదలు పెట్టుకున్న ఈ ప్రాజెక్టు రీసెంట్ గానే అధికారిక ప్రకటనతో ఆడియన్స్ ముందుకు వచ్చి ఫుల్ జోష్ ని నింపింది . కాగా సంక్రాంతి కానుకగా ఈ మూవీ నుండి టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు మేకర్స్.

ఈ క్రమంలోనే ప్రముఖ మూవీ రేటింగ్ వెబ్సైట్ ఐఎండిబి రాజాసాబ్ మూవీ స్టోరీ లైన్ ఇదే అంటూ ఓ డిస్క్రిప్షన్ రాసింది. ” ఈ సినిమా కధ ఒక కపుల్ చుట్టూ తిరుగుతుందని ..ప్రేమలో పడిన ఇద్దరి వ్యక్తుల డెస్టిని ని నెగటివ్ ఎనర్జీ వల్ల వేరే దారి మల్లుతుందని పేర్కొంది”. దీంతో మారుతి వెంటనే రియాక్ట్ అయ్యాడు . ఐఎండీబీకి గట్టి కౌంటర్ ఇచ్చారు .

“అరెరె .. నాకు ఇది తెలియక వేరే స్క్రిప్ట్ తో సినిమా షూట్ చేసేసాను ..ఎలా ఇప్పుడు..? ఐఎండిబి, ఈ సమాజం అంగీకరిస్తుందా..? అంటూ తనదైన స్టైల్ లో బదులిచ్చారు “. ప్రస్తుతం ఈ కామెంట్స్ వైరల్ గా మారాయి . ఈ మూవీ హార్రర్ బ్యాక్ గ్రౌండ్ లో తెరకెక్కుతున్నట్లు మూవీ టీం ఇప్పటికే తెలియజేసింది. చూడాలి మరి ఈ సినిమా అభిమానులని ఏ రేంజ్ లో ఆకట్టుకుంటుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news