Moviesటికెట్లు అమ్ముడు పోతున్నాయ్..బజ్ బాగా పెరిగింది.. కానీ, ఆ విషయంలో తేడా...

టికెట్లు అమ్ముడు పోతున్నాయ్..బజ్ బాగా పెరిగింది.. కానీ, ఆ విషయంలో తేడా కొడుతున్న “హనుమాన్”..!

సోషల్ మీడియాలో గుంటూరు కారం – హనుమాన్ సినిమాల మధ్య ఫైట్ ఎంత టఫ్ గా నెలకొన్నదో మనం చూస్తున్నాం. జనరల్గా సంక్రాంతి అంటేనే బాక్సాఫీస్ వద్ద పెద్దవార్ జరుగుతుంది . కానీ ఈసారి ఎవ్వరు ఊహించని విధంగా పెద్ద తలకాయతోనే ఢీకొట్టబోతున్నాడు చిన్న హీరో తేజ . దీంతో సోషల్ మీడియాలో ఈ రెండు సినిమాలకు సంబంధించిన వార్తలు బాగా ఎక్కువగా ట్రెండ్ అవుతున్నాయి. కాగా తేజ సజ్జా హీరోగా నటించిన హనుమాన్ సినిమా జనవరి 12వ తేదీ థియేటర్స్ రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే.

సినిమా బజ్ కూడా బాగానే ఉంది . ప్రమోషన్స్ కూడా బాగా నిర్వహిస్తున్నారు . అంతేకాదు హనుమాన్ మూవీకి భారీ స్థాయిలో టికెట్స్ బుకింగ్ కూడా జరిగిపోతున్నాయి. తెలుగు రాష్ట్రాలలోనూ ఈ చిత్రానికి 108 ప్రీమియర్ షో ప్రదర్శించబడుతున్నాయి . తొమ్మిది భాషల్లో ఆయన ఈ సినిమాని రిలీజ్ చేస్తూ ఉండడం సినిమాకి హైలెట్గా మారింది. ఈ సినిమాకి మ్యూజిక్ కూడా మరో ప్లస్ గా మారిపోతుంది. వరలక్ష్మి శరత్ కుమార్ నటన ఈ సినిమాకి చాలా హైలైట్ గా మారిపోతుందట. దీంతో సినిమాపై మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి .

కానీ అందరికీ డౌట్ కొట్టేది ఒకటే .. సంక్రాంతి అంటే హ్యాపీగా ఫ్యామిలీ అంతా కలిసి ఒక దగ్గర చేసుకునే పండుగ . సినిమా చూసి సరదాగా నవ్వుకోవాలి ఎంజాయ్ చేయాలి.. మరి అలాంటి కంటెంట్ ఈ హనుమన్ సినిమాలో ఉంటుందా ..?? అనేది ప్రశ్నార్ధకంగా మారింది. ఎందుకంటే హనుమాన్ సినిమా ఢీకొట్టబోయేది గుంటూరు కారంతో . ఒక్క ట్రైలర్ తోనే మడత పెట్టేసాడు మహేష్ బాబు . హనుమాన్ ట్రైలర్ బాగున్నప్పటికీ కుటుంబం అంతా కలిసి చూడగలదా..? లేడీస్ కి నచ్చుతుందా ..?? అన్న క్యూస్షన్స్ కూడా ఎదురవుతున్నాయి . గుంటూరు కారం ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్.. కచ్చితంగా బావ మరదలు , అక్క చెల్లెలు అందరూ కలిసి చూసి ఎంజాయ్ చేసే మూవీ అంటున్నారు .మరి హనుమాన్ సినిమా ఇండివిడువల్ గా కొందరికి నచ్చుతుందేమో కానీ ..కుటుంబమంతా కలిసి కూర్చొని టైం స్పెండ్ చేసి చూసే సినిమానా అన్న క్వశ్చన్స్ లేవదీస్తున్నారు ..?? దీంతో హనుమాన్ రిజల్ట్ ప్రశ్నార్థకంగా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news