టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రధాన పాత్రలో, డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ గుంటూరు కారం. భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అంచనాలు అందుకోలేదనే అంటున్నారు. ఇంకా బాక్సాఫీస్ దగ్గర గుంటూరు కారం రికవరీ చేయాల్సిన మొత్తం చాలానే ఉంది. ఇక ఈ సినిమా రిలీజ్‌కు ముందే నిర్మాత నాగవంశీ చాలా ఓవర్ కాన్పిడెన్స్‌గా మాట్లాడారు.
నాన్ రాజమౌళి రికార్డులు అన్నీ తమ సినిమా బ్రేక్ చేస్తుందని… రాజమౌళి సినిమాల నెంబర్స్‌కు దగ్గరగా గుంటూరు కారం వసూళ్ల లెక్కలు ఉంటాయని ఆయన చెప్పడంపై ఆయనకు చాలా ఓవర్ కాన్ఫిడెన్స్ అన్న చర్చలు కూడా సినిమా రిలీజ్‌కు ముందు జరిగాయి. ఇక ఇప్పుడు సినిమా రిలీజ్ అయ్యాక కూడా ఆయన తమ సినిమా సూపర్ హిట్ అంటూ భారీ నెంబర్లు చూపిస్తూ పోస్టర్లు వేస్తూ ప్రచారం చేస్తున్నారు.
ఈ క్రమంలోనే గుంటూరు కారం సినిమాకు నెగటివ్ రావడం వెనక మిడ్‌నైట్ 1 గంట షోలు అంటూ కామెంట్ చేశారు. సలార్ సినిమాకు, గుంటూరు కారం సినిమాకు మిడ్ నైట్ షోలు వేశారని.. అయితే సలార్ మాస్ సినిమా కావడంతో ఆ సినిమాకు మంచి టాక్ వచ్చిందని.. గుంటూరు కారం ఫ్యామిలీ సినిమా కావడంతో మిడ్ నైట్ షోలు ఫ్యాన్స్ ఎంజాయ్ చేయలేకపోయారంటూ నాగవంశీ మాట్లాడారు.
అయితే నాగవంశీ సినిమా రిలీజ్‌కు ముందు నుంచే చాలా ఓవర్ కాన్పిడెన్స్‌తో మాట్లాడారని.. తమ సినిమాలో అనుకున్నంత సత్తాలేదని ఒప్పుకోకుండా సలార్ మాస్ సినిమా.. తమది ఫ్యామిలీ సినిమా అంటూ తమ సినిమా అంచనాలు అందుకోలేదన్న విషయాన్ని ఒప్పుకోకుండా ఇలా నర్మగర్భ వ్యాఖ్యలు చేశారన్న కామెంట్లు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి.
ఇక గుంటూరు కారం సినిమాలో మహేష్‌బాబుకు జోడీగా యంగ్ బ్యూటీ శ్రీ లీల హీరోయిన్ గా నటించగా, మీనాక్షి చౌదరి, రమ్య కృష్ణ, ప్రకాష్ రాజ్, జగపతి బాబు, ఈశ్వరి రావు, జయరామ్ తదితరులు కీలక పాత్రల్లో నటించగా థమన్ సంగీతం అందించారు.