టాలీవుడ్ ఇండస్ట్రీలో ఐకాన్ హీరో అల్లు అర్జున్ పేరు ఇప్పుడు ఏ రేంజ్ లో మారు మ్రోగిపోతుందో మనకు తెలిసిందే. ఒకటి కాదు రెండు కాదు కోట్లాదిమంది అభిమానుల మనసు దోచుకున్న బన్నీ ఇప్పుడు పుష్ప2 సినిమా షూట్ లో బిజీగా ఉన్నాడు . కాగా పుష్ప1 సినిమా ఎంత హిట్ అయిందో మనకు తెలిసిందే. ఇలాంటి మూమెంట్లోనే బన్నీకి సంబంధించిన వార్తలు బాగా ట్రెండ్ అవుతున్నాయి .
అల్లు అర్జున్ తన కెరీర్ ని డాడీ అనే సినిమాతో మొదలుపెట్టాడు . ఈ సినిమాలో ఆయన గెస్ట్ పాత్రలో కనిపించారు . ఆ తర్వాత గంగోత్రి సినిమాతో హీరోగా తన సినిమా ఎంట్రీని ఫిక్స్ చేశాడు . ఆ తర్వాత బన్నీ సినిమాలో స్టైలిష్ స్టార్ గా మారిపోయాడు. నిజానికి బన్నీ సినిమాలో హీరోయిన్గా శ్రీజని అనుకున్నారట . అల్లు అరవింద్ కూడా అదే ఫిక్స్ అయ్యారట. కానీ మెగాస్టార్ చిరంజీవి మాత్రం అందుకు ఒప్పుకోలేదట .
మొదటి నుంచి తన కూతుర్లని హీరోయిన్స్ అవ్వాలి అని చిరంజీవి అనుకోలేదట . ఆ కారణంగానే శ్రీజ కి హీరోయిన్ అవ్వాలి అన్న ఇంట్రెస్ట్ ఉన్నా కూడా చిరంజీవి ఆమెను సినిమాలో నటింప చేయడానికి ఒప్పుకోలేదు . అలా వీళ్ళ కాంబోలో ఓ సినిమా మిస్సయింది. ప్రసెంట్ బన్నీ పలు సినిమాలతో బిజీ గా ఉంటే.. శ్రీజ రెండు పెళ్లిలు చేసుకుని విడాకులు ఇచ్చేసి సైలెంట్ గా ఉంది..!!