Moviesవిశ్వంభ‌ర హీరోయిన్ కోసం రెండుగా చీలిపోయిన మెగాఫ్యాన్స్‌... కొట్టేసుకుంటున్నారు...!

విశ్వంభ‌ర హీరోయిన్ కోసం రెండుగా చీలిపోయిన మెగాఫ్యాన్స్‌… కొట్టేసుకుంటున్నారు…!

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి గ‌త రెండేళ్లు యేడాదికి రెండేసి సినిమాల‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చారు. ప్ర‌స్తుతం చిరు బింబిసార ద‌ర్శ‌కుడు మ‌ల్లిడి వ‌శిష్ట్ ద‌ర్శ‌క‌త్వంలో విశ్వంభ‌ర అనే సోషియో ఫాంట‌సీ సినిమాలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాను మైత్రీ మూవీ మేక‌ర్స్ ఏకంగా రు. 150 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో నిర్మిస్తోంది. ఈ సినిమా ఇప్ప‌టికే సెట్స్ మీద‌కు కూడా వెళ్లింది.

ద‌ర్శ‌కుడు వ‌శిష్ట్ చాలా ప్ర‌తిష్టాత్మ‌కంగా ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. జ‌గ‌దేక‌వీరుడు అతిలోక‌సుంద‌రి రేంజ్‌లో ఈ సినిమా క‌థ‌, క‌థ‌నాలు ఉంటాయ‌ని వ‌శిష్ట్ ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు. ఇక విశ్వంభ‌ర సినిమాలో ఇద్ద‌రు, ముగ్గురు హీరోయిన్లు ఉంటార‌ని తెలుస్తోంది. చిరు ప‌క్క‌న మెయిన్ హీరోయిన్ కోసం మెగాభిమానులు కూడా రెండుగా చీలిపోయిన‌ట్టుగా తెలుస్తోంది.

చిరుకు జోడీగా కాజ‌ల్‌, త్రిష పేర్లు చ‌ర్చ‌ల్లో ఉన్నాయి. కాజ‌ల్ చిరు రీ ఎంట్రీ సినిమా ఖైదీ నెంబ‌ర్ 150లో న‌టించింది. ఇక త్రిష అయితే ఎప్పుడో స్టాలిన్ సినిమాలో చిరు ప‌క్క‌న జోడీ క‌ట్టింది. కొంద‌రు మెగాభిమానులు చిరు ప‌క్క‌న హీరోయిన్ విష‌యంలో రెండుగా చీలిపోయారు. కాజ‌ల్ అయితే చిరు ప‌క్క‌న హైట్‌గా చ‌క్క‌గా మ్యాచ్ అవుతుంద‌ని అంటుంటే.. కాదు త్రిష ఈ వ‌య‌స్సులోనూ ప‌ర్‌ఫెక్ట్ ఫిజిక్‌తో ఉంది.. పైగా లియో సినిమాలో ఆమె చాలా అందంగా ఉంది.. ఆమె అయితేనే సినిమాకు ప్ల‌స్ అవుతుంద‌ని అంటున్నారు.

ఇలా చిరు ప‌క్క‌న హీరోయిన్ కోసం మెగాభిమానుల్లో కొంద‌రు త్రిష కావాలంటుంటే కొంద‌రు కాజ‌ల్ కావాలంటున్నారు. ఇక హనుమాన్ సినిమాతో బాగా పాపుల‌ర్ అయిన‌ వరలక్ష్మి శరత్ కుమార్ కూడా ఈ క్రేజీ ప్రాజెక్టులో కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఈ సినిమాకు ఎంఎం. కీర‌వాణి మ్యూజిక్ అందిస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news