Moviesప్ర‌భాస్ పెళ్లికి 2024కు లింక్ ఏంటి... అదే అస‌లు ట్విస్టు...!

ప్ర‌భాస్ పెళ్లికి 2024కు లింక్ ఏంటి… అదే అస‌లు ట్విస్టు…!

పై టాపిక్ ఇప్పటికిప్పుడు పుట్టుకొచ్చిన చర్చ కాదు.. క్యాలెండర్ మారిన ప్రతిసారి ఈ చర్చ కొత్తగా మొదలవుతూనే ఉంటుంది. ఫ్యాన్స్ కు అదొక సంతృప్తి అంతే. అదే టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పెళ్లి. గత 7 – 8 సంవత్సరాలుగా ప్రభాస్ పెళ్లి తెలుగు మీడియాలోను, తెలుగు సోషల్ మీడియాలోను ఎంతలా వైరల్ అవుతుందో చూస్తూనే ఉన్నాం. ఇప్పటికే తెలుగు సోషల్ మీడియాలో కనీసం ప్రభాస్ కు ఒక వెయ్యి సార్లు పెళ్లి చేసి ఉంటారు. ప్రభాస్ కు, ముదురు ముద్దుగుమ్మ అనుష్కకు కూడా తెలుగు మీడియా, తెలుగు సోషల్ మీడియా లెక్కలేనన్నిసార్లు పెళ్లి చేసింది.

గత ఆరేడు సంవత్సరాలుగా ప్రభాస్ పెళ్లి ఎన్నోసార్లు ట్రెండ్గా నడిచింది. కనీసం 2024 కొత్త ఏడాదిలో అయినా ప్రభాస్ పెళ్లి చేసుకుంటాడా ? అన్నదే మళ్లీ ఇప్పుడు హాట్‌ టాపిక్. బాహుబలి సిరీస్ సినిమాలు తర్వాత వరుసగా మూడు ఫ్లాపులు పడ్డా.. తాజాగా వచ్చిన సలార్‌తో సక్సెస్ కొట్టాడు. ప్రభాస్ ఆ సక్సెస్ మామూలుగా ఎంజాయ్ చేయడం లేదు. అభిమానులు కూడా సలార్ సూపర్ హిట్ ఎంజాయ్ చేస్తూ ప్రభాస్ పెళ్లి గురించి చర్చించుకుంటున్నారు. ప్రభాస్ ఎప్పుడో 40 + దాటేసాడు.

ఇప్పుడు అతడిని మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిల‌ర్ అని పిలవడం కూడా కరెక్ట్ కాదు. చివరకు బాలకృష్ణ తన అన్‌స్టాప‌బుల్ టాక్‌ షోలో కూడా ప్రభాస్ పెళ్లి గురించి అడగకుండా ఉండలేకపోయాడు. ప్రభాస్ కెరీర్ పరంగా ప్రస్తుతం మంచి ఫామ్ లో ఉన్నాడు. పాన్ ఇండియా స్టార్ హీరో అనే ఇమేజ్ ఎంజాయ్ చేస్తున్నాడు. చేతిలో నాలుగైదు క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. ఇక ఈ ఏడాది కొత్త ట్విస్ట్ ఏంటంటే ఖచ్చితంగా ప్రభాస్ పెళ్లి చేసుకోబోతున్నాడని తెలుస్తోంది. ప్రభాస్ పెద్దమ్మ శ్యామలా దేవి కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించడంతో కనీసం ఈ ఏడాదిలో అయినా ప్రభాస్ ఓ ఇంటివాడు కాబోతున్నాడు అని ఆశలతో ఉండాల్సి వస్తోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news