టాలీవుడ్లో విక్టరీ వెంకటేశ్ అంటే అన్నీ వర్గాల ప్రేక్షకులు ఎంత ఇష్టపడే హీరో. కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన కలియుగ పాండవులు సినిమాతో వెంకీ హీరోగా తెలుగు తెరకు పరిచయం అయ్యాడు. తాజాగా ఈ సంక్రాంతికి తన కెరీర్లో 75వ సినిమాగా సైంధవ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇక వెంకీ తన కెరీర్లో ఎంతోమంది హీరోయిన్లతో కలిసి నటించారు.. వీరిలో కొందరు హీరోయిన్లతో వెంకీది మంచి హిట్ ఫెయిర్.
చాలా మంది హీరోయిన్లు వెంకీ అన్నా, వెంకీ పక్కన నటించడం అన్నా ఇష్టపడతారు. అలాగే ఎంతోమంది కొత్త హీరోయిన్లను వెంకీ హీరోయిన్లుగా పరిచయం చేశారు. దివంగత అందాల తార శ్రీదేవికి వెంకీ నటన అన్నా, యాట్యిట్యూడ్ అన్నా బాగా ఇష్టం. అలాగే ఖుష్బూ, దివంగత దివ్యభారతి, టబు, మీనా, సౌందర్య, సిమ్రాన్, నయనతార ఇలా చాలా మంది స్టార్ హీరోయిన్లు వెంకీని, మనోడి యాట్యిట్యూడ్ను బాగా ఇష్టపడతారు.
ఇక దివంగత సౌందర్య – వెంకీది సూపర్ హిట్ కాంబినేషన్. వీరిద్దరిది మంచి హిట్ ఫెయిర్. రాజా, పవిత్ర బంధం, పెళ్లి చేసుకుందాం, జయం మనదేరా సినిమాలు బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించాయి. అలాగే దేవిపుత్రుడు సినిమాలోనూ వీరిద్దరు కలిసి నటించారు. ఒక టైంలో వెంకీ పట్టుబట్టి మరీ తన సినిమాలో సౌందర్యే హీరోయిన్గా ఉండాలని దర్శక, నిర్మాతలకు రికమెండ్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి.
సౌందర్య కంటే ముందు వెంకీకి మీనా అంటే పెద్ద సెంటిమెంట్. వీరి కాంబినేషన్లో సుందరకాండ, చంటి, అబ్బాయిగారు పెద్ద బ్లాక్బస్టర్లు అయ్యాయి. వెంకీ – మీనా కెమిస్ట్రీ కూడా వెండితెర మీద అదిరిపోయేది. ఎప్పుడు అయితే వెంకీ.. సౌందర్యను సెంటిమెంట్‌గా డిసైడ్ అయ్యి తన సినిమాలకు రికమెండ్ చేయడం మొదలు పెట్టాడో ? అప్పటి నుంచి వెంకీ.. మీనాను సైడ్ చేసేశాడు. అలా సౌందర్య.. వెంకీకి జోడీగా వచ్చాక వెంకీ – మీనా జోడికి గండి పడిపోయింది.