తెలుగు సినిమా పరిశ్రమలో నటుడుగా పాపులర్ అయ్యారు చలపతి రావు కొడుకు రవిబాబు. ఆ తర్వాత ఆయన అల్లరి సినిమాతో దర్శకుడిగా మారాడు. విదేశాలకి వెళ్ళకుండా ఇక్కడే సెట్స్ వేసి రిచ్ గా సినిమా తీయొచ్చుననే కల్చర్ మొదలు పెట్టింది రవిబాబే. ఈవీవీ సత్యనారాయణ చిన్న కొడుకు నఋఏశ్ ని హీరోగా పెట్టి తీసిన అల్లరి మంచి పేరు తెచ్చింది.
ఆ తర్వాత రవిబాబు నచ్చావులే, అమ్మాయిలు అబ్బాయిలు, సోగ్గాడు, పార్టీ, అనసూయ, అమారావతి, నువ్విలా, మనసారా, అవును లాంటి సినిమాలకి దర్శకత్వం వహించాడు. రవిబాబు సినిమాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. కానీ, ఫస్టాఫ్ తీసినంత బాగా సెకండ్ హాఫ్ ఢీల్ చేయలేడనే పేరు తెచ్చుకున్నాడు. ఈ పేరు సోగ్గాడు సినిమాకి ఎక్కువగా వినిపించింది.
అప్పట్లో శోభన్ బాబు హీరోగా నటించిన సోగ్గాడు సినిమా టైటిల్ ని వాడుకొని తరుణ్, ఆర్తి అగర్వాల్ జంటగా సురేశ్ ప్రొడక్షన్స్ లో తెరకెక్కించాడు. అయితే, ఈ సినిమా విషయంలో రవిబాబు ఆవేశంలో తీసుకున్న ఓ డెసిషన్ సినిమా ఫ్లాపవడానికి కారణం అయిందని తానే చెప్పారు. అప్పటికే, తరుణ్..ఆర్తీ అగర్వాల్..ఉదయ్ కిరణ్ యంగ్ స్టార్స్ గా మంచి ఫాంలో ఉన్నారు. దాంతో ఈ ముగ్గురు ప్రధాన పాత్రల్లో సోగ్గాడు సినిమా ప్లాన్ చేశారు.
కానీ, ఎందుకనో ఉదయ్ కిరణ్ ఈ సినిమా చేయనని చెప్పాడట. అక్కడే రవిబాబు ఇగో హర్ట్ అయింది. దాంతో హిందీ నటుడు జుగల్ హన్సరాజ్ ని ఫైనల్ చేసుకున్నాడు. ఉదయ్ కిరణ్ ప్లేస్ లో అతను నటించి ఏమాత్రం ప్రేక్షకులను మెప్పించలేకపోయాడు. దాంతో సినిమా డిజాస్టర్ అయింది. అలా కాకుండా కాస్త ఓపిక పట్టి ఎలాగోలా ఉదయ్ ని ఒప్పించి తనతోనే ఈ సినిమాలో క్యారెక్టర్ చేయించి ఉంటే సినిమా ఇంకోలా ఉండేదని తప్పుడు డెసిషన్ తీసుకొని నిర్మాతకి నష్టం వచ్చేలా చేశానని చెప్పుకొచ్చాడు.