Moviesషోయ‌బ్ మాలిక్ - కొత్త భార్య స‌నా మ‌ధ్య ఇంత ఏజ్...

షోయ‌బ్ మాలిక్ – కొత్త భార్య స‌నా మ‌ధ్య ఇంత ఏజ్ గ్యాప్ ఉందా… ఆమె ఏ దేశ‌స్థురాలో తెలుసా..!

భార‌త స్టార్ టెన్నీస్ క్రీడాకారిణి సానియా మీర్జా – పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ విడిపోయారంటూ గ‌త కొంత కాలంగా వ‌స్తోన్న పుకార్లు ఎట్ట‌కేల‌కు నిజం అయ్యాయి. జనవరి 19న జరిగిన నికాహ్ వేడుకలో పాక్ బుల్లితెర‌ నటి సనా జావేద్‌ను షోయ‌బ్‌ మూడోసారి వివాహం చేసుకున్నాడు. ఇది షోయ‌బ్‌కు మూడో పెళ్లి కాగా… స‌నాకు రెండో పెళ్లి. ఆమె కూడా త‌న మొద‌టి భ‌ర్త‌కు విడాకులు ఇచ్చేసింది.

ఇక జనవరి 20న ఉదయం షోయ‌బ్ మాలిక త‌న కొత్త భార్య‌ సనాతో తన పెళ్లిని ప్రకటించి నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేశాడు. ఈ ఫొటోలలో, షోయబ్, సనా పెళ్లి దుస్తుల్లో క‌నిపించ‌డంతో వీరిద్ద‌రు పెళ్లి చేసుకున్న‌ట్టు క్లారిటీ వ‌చ్చింది. ఇక రెండు రోజుల త‌ర్వాత సానియా కుటుంబం కూడా వీరి విడాకుల‌పై సోష‌ల్ మీడియాలో పోస్టు పెట్టింది. షోయ‌బ్ – సానియా కొంత కాలం క్రిత‌మే విడాకులు తీసుకున్నార‌ని.. వ్య‌క్తిగ‌త జీవితాన్ని ఎప్పుడు గోప్యంగా ఉంచేందుకే సానియా ఇష్ట‌ప‌డుతుంద‌ని.. అయితే ఇప్పుడు దీనిపై క్లారిటీ ఇవ్వ‌క త‌ప్ప‌డం లేద‌ని.. షోయ‌బ్ కొత్త జీవితం ఆనందంగా ఉండాల‌ని సానియా కోరుకుంటున్న‌ట్టు కూడా ఆమె తండ్రి చెప్పారు.

ఇక షోయ‌బ్‌- స‌నా ఏజ్ పై కూడా సోష‌ల్ మీడియాలో చ‌ర్చ జ‌రుగుతోంది. షోయ‌బ్ మాలిక్ ఫిబ్రవరి 1, 1982న పాకిస్తాన్‌లోని సియాల్‌కోట్‌లోని మధ్యతరగతి పంజాబీ-ముస్లిం కుటుంబంలో జన్మించాడు. ప్ర‌స్తుతం షోయ‌బ్ వ‌య‌స్సు 41. అత‌డి తండ్రి ఓ చిన్న దుకాణం న‌డిపేవాడు. కొడుకు క్రికెట‌ర్ కావాల‌నే క‌ల‌తో తండ్రి ఎంతో క‌ష్ట‌ప‌డి మాలిక్‌ను ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట‌ర్‌గా తీర్చిదిద్దేవ‌ర‌కు క‌ష్ట‌ప‌డ్డాడు. షోయ‌బ్ తండ్రిది పాద‌ర‌క్ష‌లు విక్ర‌యించే దుకాణం.

ఇక స‌నా పాక్‌లో ఫేమ‌స్ బుల్లితెర న‌టి. ఆమె సౌదీ అరేబియాలోని జెడ్డాలో మార్చి 25, 1993 న జన్మించి అక్క‌డే పాఠ‌శాల చ‌దువు పూర్తి చేశారు. ఆ త‌ర్వాత ఆమె కుటుంబంతో క‌లిసి పాకిస్తాన్‌కు వెళ్లి.. క‌రాచీ యూనివ‌ర్సిటీ నుంచి ప‌ట్ట‌భ‌ద్రురాలు అయ్యింది. ఆమె వ‌య‌స్సు 30. షోయ‌బ్ , స‌నా మ‌ధ్య వ‌య‌స్సులో 11 ఏళ్లు గ్యాప్ ఉంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news