సోషల్ మీడియాను హీటెక్కించడంలో ముందు వరుసలో ఉంటున్నారు టాలీవుడ్ తల్లి కూతుళ్లు సురేఖవాణి, సుప్రీత. రెగ్యులర్‌గా తమ అప్డేట్స్ ఇవ్వడంతో పాటు మతి పోగొట్టే ఫోటోలు షేర్ చేస్తూ కుర్రకారుకు గాలం వేస్తూ ఉంటారు. సురేఖ వాణి తన కూతురుతో కలిసి సోషల్ మీడియాలో చేసే రచ్చ, హంగామా అంతా ఇంతా కాదు. ముఖ్యంగా సుప్రీతకు సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది.
ఏ విషయంలో అయినా.. చివరకు బోల్డ్ విషయాలు అయినా చాలా ఓపెన్ గా చేస్తూ చూపిస్తూ ఉంటారు ఈ తల్లి కూతుళ్లు. ఇక సురేఖ వాణి తన కుమార్తె సుప్రీతను టాలీవుడ్ లో హీరోయిన్గా పరిచయం చేయాలని ఎప్పటినుంచో ప్రయత్నాలు చేస్తుంది. అయితే పేరు ఉన్న హీరోల సర్చన ఛాన్సులు వస్తేనే తన కుమార్తెను హీరోయిన్గా పరిచయం చేయాలని సురేఖ పట్టుదలతో ఉంది. చిన్నాచితకా హీరోల పక్కన నటిస్తే అంత కెరియర్ ఉండదేమో అని సురేఖ వాణి ఆలోచనగా తెలుస్తోంది.
తాజాగా సురేఖ ఇన్‌స్టాగ్రామ్‌లో తన అభిమానులతో చిట్ చాట్ చేసింది. ఈ క్రమంలోనే తన సినీ ఎంట్రీ పై స్పందించింది. త్వరలోనే తన సినీ ఎంట్రీ ఉంటుందని ఇన్ డైరెక్ట్ గా చెప్పేసింది. దీంతో సుప్రీత అప్ కమింగ్ స్టార్ హీరోయిన్ అంటూ పోస్టులు పెడుతున్నారు ఆమె అభిమానులు. ఆమె గ్లామర్ పిక్‌లు ఒక రేంజ్ లో వైరల్ చేస్తున్నారు. సినిమా అవకాశాలు టార్గెట్‌గా సుప్రీత ఫోటోషూట్ చేస్తుందని టాక్ ఎప్పటినుంచో ఉంది.
టాలీవుడ్ ఇన్నర్ సర్కిల్స్ ప్రకారం ఓ టాలీవుడ్ స్టార్ హీరోకు జోడీగా సుప్రీతను హీరోయిన్గా పరిచయం చేయాలని సురేఖవాణి గట్టి ప్రయత్నాలు చేస్తోందట. ఒకరిద్దరు నిర్మాతలతో కూడా ఆమె సంప్రదింపులు నడుపుతోందంటున్నారు. అందుకే 22 ఏళ్లు వచ్చినా ఇంకా సుప్రీత హీరోయిన్గా తెలుగు తెరకు పరిచయం కాలేదని.. స్టార్ హీరో టార్గెట్ వల్లే ఆమె సినీ ఎంట్రీ లేట్ అవుతోందని అంటున్నారు.