మెగా డాటర్ గా పాపులారిటీ సంపాదించుకున్న శ్రీజ సోషల్ మీడియాలో ఎలాంటి ట్రోలింగ్కి గురవుతూ ఉంటుందో మనకు తెలిసిందే. ఈ మధ్యకాలంలో శ్రీజ పేరు మరింత స్థాయిలో మారుమ్రోగిపోయింది .
మరీ ముఖ్యంగా రెండు పెళ్లిళ్లు చేసుకుని రెండుసార్లు కూడా డివర్స్ ఇవ్వడం ఆమె కెరియర్ కి మైనస్ గా మారింది . ప్రతిసారి కూడా జనాలు ఆమెని తప్పుగా ట్రీట్ చేశారు . శ్రీజదే తప్పు అంటూ ట్రోలింగ్కి గురి చేశారు . మరి ముఖ్యంగా కళ్యాణ్ దేవ్ తో విడాకులు తర్వాత శ్రీజను ఓ రేంజ్ లో వాడేసుకున్నారు .
మెగా ఫ్యామిలీ లో జరిగే నెగటివ్ అన్నిటికీ కారణం శ్రీజ అంటూ దారుణంగా మాట్లాడారు. రీసెంట్ గా శ్రీజ కళ్యాణ్ దేవ్ తో విడాకులపై క్లారిటీ ఇచ్చింది . రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన శ్రీజ ఎందుకు కళ్యాణ్ దేవ్ తోవిడిపోవాల్సి వచ్చింది అనే విషయంపై ఓపెన్ అయింది . “మెగా ఫ్యామిలీ లో పుట్టినప్పటికీ ప్రస్తుతం ఒంటరిగానే బ్రతుకుతున్నాను ..నేను విడాకులు తీసుకున్నప్పుడు చాలామంది నన్ను చాలా విధాలుగా మాట్లాడి బాధపెట్టారు “..
“నా కుటుంబాన్ని బ్లెమ్ చేసి దారుణంగా ట్రోల్ చేశారు.. అది చూసి ఎంతో ఏడ్చాను.. మానసికంగా బాధపడిపోయాను.. ఎవరు కూడా విడాకులు తీసుకోవాలని పెళ్లి చేసుకోరు కదా..? ఎవరైనా పెళ్లి చేసుకునే ముందు ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. వాళ్ళు మన ఇంట్లో అమ్మానాన్నలా ఉండరు కదా.. అంత ప్రేమగా అస్సలు చూసుకోలేరు ,,మా నాన్న చిరంజీవి గారికి నేనంటే ప్రాణం ఆయనలా నన్ను ఎవరు చూసుకోరు “అంటూ ఎమోషనల్ గా చెప్పుకొచ్చింది. ప్రస్తుతం శ్రీజ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి . శ్రీజ ఎంతో బాధపడిందని..అందుకే ఇలా పరోక్షంగా తన విడాకులపై క్లారిటీ ఇచ్చేసింది అంటున్నారు మెగా ఫాన్స్..!!