Moviesఒకప్పుడు ఎన్టీఆర్ కు హీరోయిన్..ఇప్పుడు 'అత్తా.. దేవరలో జాన్వి కపూర్ కి...

ఒకప్పుడు ఎన్టీఆర్ కు హీరోయిన్..ఇప్పుడు ‘అత్తా.. దేవరలో జాన్వి కపూర్ కి అమ్మగా నటిస్తుంది ఎవరో తెలుసా..?

ప్రెసెంట్ కోట్లాదిమంది సినీ లవర్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్న సినిమా దేవర . ఎన్టీఆర్ నటిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్గా జాన్వి కపూర్ నటిస్తుంది. ఈ సినిమాలో రెండో హీరోయిన్ పాత్ర కూడా ఉంది . అయితే ఇంకా మేకర్స్ ఆమె ఎవరు అనేది ఫైనలైజ్ చేయలేదు . అందుతున్న సమాచారం ప్రకారం ఆ పాత్ర కోసం మృణాల్ ఠాకూర్ -రష్మిక మందన్నా-సాయి పల్లవి.. ఇలాంటి హీరోయిన్లను చూస్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారట.

రీసెంట్గా ఈ సినిమాకి సంబంధించి మరొక న్యూస్ వైరల్ అవుతుంది. ఈ సినిమాలో జాన్వి కపూర్ కి తండ్రిగా శ్రీకాంత్ నటించబోతున్నారు . అయితే శ్రీకాంత్ కి జోడిగా ఈ సినిమాలో జాన్వి కపూర్ కు అమ్మగా హీరోయిన్ ప్రియమణి నటించబోతుందట. నేషనల్ అవార్డు విన్నర్ అయిన ప్రియమణి ఈ పాత్రకు తగిన న్యాయం చేస్తుంది అంటూ ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ పాత్రకు చాలా మంది హీరోయిన్స్ ని అనుకున్నారట. ఫైనల్లీ ప్రియమణి సెలక్ట్ అయిన్నట్లు తెలుస్తుంది.

ఒకప్పుడు ఎన్టీఆర్ నటించిన యమదొంగ సినిమాలో ఆమె హీరోయిన్ గా చేసింది. ఇప్పుడు ఆయనకు అత్తగా నటించబోతుంది .. మరి వీళ్ళ స్క్రీన్ స్పేస్ ఎలా ఉండబోతుందో చూద్దాం. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కే ఈ సినిమాపై నందమూరి అభిమానులకు హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. కచ్చితంగా ఈ సినిమా చరిత్ర తిరగరాయబోతుంది అంటున్నారు ఫ్యాన్స్..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news