సినిమా ఇండస్ట్రీలో స్టార్ సింగర్ గా పాపులారిటీ సంపాదించుకున్న సునీత గురించి అందరికీ తెలిసిందే . ఆమె చైల్డ్ హుడ్.. ఆ తర్వాత ఆమె పడిన బాధలు.. పెళ్లి చేసుకొని ఆమె అనుభవించిన నరకం అందరికీ తెలిసిన విషయమే . కాగా రీసెంట్గా సునీత కొడుకు ఆకాష్ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు . సర్కారు నౌకరి అనే సినిమా ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇచ్చారు. ఈ సినిమా పాజిటివ్ టాక్ దక్కించుకుంది . సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సునీత కొడుకు మాట్లాడుతూ తన తల్లి రెండో పెళ్లిపై కీలక కామెంట్స్ చేశాడు .
సర్కారు నౌకరి ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆకాష్ ..”అమ్మ మమ్మల్ని పెంచడానికి చాలా చాలా కష్టపడింది. ఆ విషయం నాకు చెల్లికి మాత్రమే తెలుసు . నేను చిరంజీవి గారి సినిమాలు చూసే పెరిగాను ..డాన్స్ నేర్చుకున్నాను ..డిగ్రీ చదివే టైంలోనే హీరో అవ్వాలనుకున్నాను ..అమ్మకాళ్లు విరగ్గొడతాను అన్నింది ..అందుకే చదువు కంప్లీట్ చేసి నటనలోకి దిగాను ..అమ్మ రెండో పెళ్లి చేసుకుంటుంది అని తెలియగానే ఒకటే అడిగాను ..నీకు ఆయనపై నమ్మకం ఉందా ..?”అని అమ్మ చాలా చాలా నమ్మకం ఉంది అంటూ చెప్పింది”.
“అంతే ఆమె సంతోషమే మాకు ఇంపార్టెంట్ ..ఆమె సంతోషంగా ఉండాలని నేను చెల్లి ఎప్పుడూ కోరుకుంటాం . పెళ్లి తర్వాత రామ్ గారు కూడా చాలా చాలా బాగా చూసుకుంటున్నారు మా అమ్మని. అంతేకాదు మా నాన్నకి కూడా మా అమ్మ రెండో పెళ్లి చేసుకోవడం ఇష్టమే.. మా నాన్న రామ్ గారు బాగా మాట్లాడుకుంటారు. మంచి బెస్ట్ ఫ్రెండ్స్. అమ్మ రెండో పెళ్లి చేసుకోవడం పై నాన్న కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇద్దరు కలిసి భోజనం కూడా చేస్తారు. మొత్తానికి ఇన్నాళ్లు మా అమ్మ జీవితంలో సంతోషం లేదు ..ఇప్పుడు ఒక తోడు దొరికింది ఇంతకన్నా మాకేం కావాలి ..ఆమె హ్యాపీగా ఉండడమే మాకు కావాల్సింది” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఆకాష్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి..!!