Moviesచాలా కాలం తర్వాత మళ్లీ ఫుల్ హ్యాపీగా ఉన్న సమంత .....

చాలా కాలం తర్వాత మళ్లీ ఫుల్ హ్యాపీగా ఉన్న సమంత .. ఎందుకో తెలుసా..?

సమంత.. ఈ పేరుకి ప్రత్యేక పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు . సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది . అంతేకాదు ఏం మాయ చేసావే సినిమా ద్వారా ఓవర్ నైట్ లో ఇండస్ట్రీని తన గ్రిప్ లోకి తెచ్చుకునింది . ఆ తర్వాత సమంత ఇండస్ట్రీలో రాజ్యం ఏలేసిందనే చెప్పాలి . అంతేకాదు నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకొని కెరీర్లో మరింత ముందుకు వెళ్లడానికి ట్రై చేసింది.

కానీ వాళ్ళ మధ్య వచ్చిన మనస్పర్ధలు కారణంగా విడాకులు తీసుకున్నారు . విడాకుల తర్వాత నీ లైఫ్ నీది నా లైఫ్ నాది అంటూ ముందుకు వెళ్తున్నారు. కాగా మయోసైటిస్ వ్యాధికి గురైన తర్వాత సమంత సినిమాలు చేయడం మానేసింది . ప్రజెంట్ ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసి కొత్త సినిమాలను నిర్మించడానికి చూస్తుంది . కాగ ఇదే క్రమంలో తేజ నటించిన హనుమాన్ సినిమాను ప్రమోట్ చేసింది .

ఓ బేబీ సినిమాలో తేజ సజ్జ సమంత కలిసిన నటించారు . ఆ టైంలో వీళ్లు బాగా మంచి ఫ్రెండ్స్ అయిపోయారు. ఈ క్రమంలోనే తేజా సజ్జా మంచి టాలెంట్ ఉన్న పర్సన్ అంటూ ఆయనకు హెల్ప్ చేయడం మొదలుపెట్టింది . హనుమాన్ సినిమాకి సపోర్ట్ చేసి తన వంతు సహాయం చేసింది . ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో అందరూ తేజను పొగుడుతూ ఉండడంతో సమంత హ్యాపీగా ఫీల్ అవుతుంది . చాలాకాలం తర్వాత సమంత ఇంత హ్యాపీగా ఉన్నట్లు తెలుస్తుంది..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news