ప్రెసెంట్ సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో టెన్నిస్ స్టార్ ప్లేయర్ సానియా మీర్జా విడాకులు ఎలా వైరల్ అవుతున్నాయో మనం చూస్తూనే ఉన్నాం. పాకిస్తాన్ క్రికెట్ ప్లేయర్ షోయబ్ మాలిక్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న సానియా మీర్జా కొన్నాళ్లపాటు ఫ్యామిలీ లైఫ్ ను బాగా ఎంజాయ్ చేసింది . వాళ్ళ ఫోటోలు వాళ్ళ వీడియోలు అబ్బో ఒకటా రెండు సోషల్ మీడియాని చెక్ చేసి పడేసాయి.
ప్రపంచంలో ఇంతకంటే అన్యోన్యమైన జంట మరొకటి ఉంటుందా..? అనే అంత డౌట్లు పుట్టించారు. సీన్ కట్ చేస్తే అభిమానులకి చెప్పకుండానే విడాకులు తీసేసుకున్నారు ఈ జంట . సానియా మీర్జా -షోయబ్ మాలిక్ ల మధ్య మనస్పర్ధలు వస్తున్నాయి అంటూ గతంలో ప్రచారం జరిగింది . అయితే రీసెంట్గా ఆయన పెళ్ళికి సంబంధించిన ఫోటోలు వైరల్ అవ్వడంతో సానియా షోయబ్ విడాకులు తీసుకున్నారు అన్న విషయం అఫీషియల్ గా బయటపడింది.
అయితే గతంలో హీరోయిన్ సమంత నాగచైతన్య విడాకుల విషయంలో జరిగిన తప్పే సానియా మీర్జా షోయబ్ మాలిక్ విషయంలో జరిగింది అన్న ప్రచారం ఎక్కువగా జరుగుతుంది . సానియా మీర్జా నే షోయబ్ ను విడాకులు కావాలి అంటూ అడిగింది అని తన తండ్రి చెప్పుకొచ్చాడు . అంతేకాదు గతంలో హీరోయిన్ సమంత కూడా తానే విడాకులు కావాలి అంటూ నాగచైతన్యను అడిగింది అన్నా ఓ విషయం స్పెషల్ ఇంటర్వ్యూలో బయటపడింది . ఇలా ఇద్దరు తమ లైఫ్ని తామే నాశనం చేసుకున్నారు . కోపాన్ని కొంచెం సేపు పక్కన పెడితే హ్యాపీగా ఫ్యామిలీ లైఫ్ లో ఎంజాయ్ చేస్తుంటే వాళ్ళు అంటున్నారు అభిమానులు..!!