Movies"గుంటూరు కారం" ఫ్లాప్ అవ్వడానికి కారణం రాజమౌళినే.. తెర పైకి సంచలన...

“గుంటూరు కారం” ఫ్లాప్ అవ్వడానికి కారణం రాజమౌళినే.. తెర పైకి సంచలన మ్యాటర్..!!

పాపం తాను ఒకటి తెలిస్తే దైవం మరొకటి తలచింది అన్నట్లు భారీ అంచనాల నడుమ భారీ బడ్జెట్లో తెరకెక్కి రిలీజ్ అయిన గుంటూరు కారం సినిమా బాక్సాఫీస్ వద్ద తుస్సు మనిపించింది . అంతేకాదు ఈ సినిమాపై మొదట హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి . గుంటూరు కారం ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో మహేష్ బాబు కూడా చాలా ఎమోషనల్ గా మాట్లాడారు. తన తండ్రి లేకుండా చేసిన ఫస్ట్ సినిమా ఇదే అని నాకు మీరే తల్లిదండ్రులు అంటూ చాలా ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యారు.

అయితే సినిమా రిలీజ్ అయిన తర్వాత సీన్ మాత్రం మారిపోయింది. సినిమాలో పెద్దగా మ్యాటర్ లేదని .. మహేష్ బాబు నటన శ్రీ లీల డాన్స్ తప్పిస్తే మరి ఎక్కడ కూడా సినిమా చెప్పుకోదగ్గ పాయింట్స్ లేవు అంటూ ట్రోల్ చేశారు . అంతేకాదు ఇప్పుడు ఈ సినిమా ఫ్లాప్ అవ్వడానికి కారణం రాజమౌళి అంటూ ట్రోల్ చేస్తున్నారు . రాజమౌళితో ఏ హీరో అయితే సినిమాకి కమిట్ అవుతాడు ఆ హీరోకి ముందు సినిమా ఫ్లాప్ అవడం కన్ఫామ్ అని బ్యాడ్ సెంటిమెంట్ ను క్రియేట్ చేశారు .

గతంలో వినయ విధేయ రామ సినిమాతో రామ్ చరణ్ డిజాస్టర్ అందుకున్నాడు .ఆ తర్వాత ఆర్ఆర్ఆర్ సినిమాతో సూపర్ డూపర్ హిట్ అందుకున్నాడు. ఇప్పుడు అదే మాదిరి మహేష్ బాబు గుంటూరు కారం తో ఫ్లాప్ అందుకున్నాడు అని .. మళ్ళీ రాజమౌళి సినిమాతో సూపర్ హిట్ అందుకుంటాడు అని ఇదంతా రాజమౌళి బ్యాడ్ సెంటిమెంటే అని ఓ న్యూస్ ని ట్రెండ్ చేస్తున్నారు జనాలు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news