రాజమౌళి ఏంటి ? సీనియర్ ఎన్టీఆర్‌కు మాట ఇవ్వడం ఏంటి ? జూనియర్ ఎన్టీఆర్‌తో నెరవేర్చడం ఏంటనుకుంటున్నారా ? దీని వెనక ఆసక్తికర కథే ఉంది. టాలీవుడ్ సీనియర్ దర్శకుడు కె. రాఘవేంద్రరావవు.. సీనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. ఇక ఎన్టీఆర్ బాలనటుడిగా కూడా తాత సినిమాల్లో కనిపించారు. జూనియర్ ఎన్టీఆర్‌కు మంచి భవిష్యత్తు ఉందని గ్రహించిన సీనియర్ ఎన్టీఆర్.. రాఘవేంద్రరావును ఓ కోరిక కోరారట.
తన మనవడిని సినిమాల్లోకి నీ చేతుల మీదుగా తీసుకువచ్చి… నీ దర్శకత్వంలోనే తొలి సినిమా చేయాలని కోరగా.. రాఘవేంద్రరావు ఓకే చెప్పారట. ఎన్టీఆర్ బాల రామాయణం సినిమాలో బాలనటుడిగానే సినిమా చేసి సూపర్ హిట్ కొట్టారు. రాఘవేంద్రరావు దర్శకత్వంలోనే ఎన్టీఆర్ హీరోగా వెండితెరకు పరిచయం కావాల్సి ఉంది.. అయితే ఎన్టీఆర్ తండ్రి హరికృష్ణ అప్పటికే రామెజీరావు బ్యానర్లో తన తనయుడి తొలి సినిమా చేయిస్తానని ఆయనకు మాట ఇచ్చారు. అలా ఎన్టీఆర్ ఉషాకిరన్ బ్యానర్లో నిన్ను చూడాలని తొలి సినిమా చేశారు.
ఇక ఎన్టీఆర్ రెండో సినిమా స్టూడెంట్ నెంబర్ 1కు అశ్వనీదత్ నిర్మాత. స్వప్న సినిమా బ్యానర్‌పై ఆయన నిర్మించారు. రాఘవేంద్రరావును దర్శకుడిగా అనుకున్నారు. అప్పటికే రాఘవేంద్రరావు శిష్యుడు రాజమౌళితో కలిసి ఆయన దర్శకత్వ పర్యవేక్షణలో సీరియల్స్ నిర్మిస్తున్నారు. ఈ క్రమంలోనే రాజమౌళిని దర్శకుడిగా కూడా పరిచయం చేయాలని ఆయన అనుకున్నారు. స్టూడెంట్ నెంబర్ 1 సినిమా అంతా రాజమౌళియే తెరకెక్కించారు.
కానీ రాజమౌళి.. తన గురువు గారు రాఘవేంద్రరావు మీద గౌరవంతో పాటు ఆయన సీనియర్ ఎన్టీఆర్‌కు జూనియర్ ఎన్టీఆర్ సినిమా తీస్తానని గతంలో ఇచ్చిన మాట నేపథ్యంలో దర్శకత్వ పర్యవేక్షణ బాధ్యతలు రాఘవేంద్రరావు అనే టైటిల్ కార్డ్స్‌లో వేయించారు. అలా స్టూడెంట్ నెంబర్ 1 సినిమా రాజమౌళి డైరెక్ట్ చేసినా దర్శకత్వ పర్యవేక్షణ పేరు మాత్రం రాఘవేంద్రరావుదే ఉంటుంది. ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో పాటు ఎన్టీఆర్ కెరీర్‌కు మెయిన్ పిల్లర్‌గా నిలిచింది.