Moviesఆ ఇద్ద‌రు కుర్ర ద‌ర్శ‌కుల‌కు మెగాస్టార్ హ్యాండ్ ఇచ్చేసిన‌ట్టే..!

ఆ ఇద్ద‌రు కుర్ర ద‌ర్శ‌కుల‌కు మెగాస్టార్ హ్యాండ్ ఇచ్చేసిన‌ట్టే..!

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం తన 156వ సినిమాను మల్లిడి వశిష్ట డైరెక్షన్లో చేస్తున్నారు. నంద‌మూరి హీరో కళ్యాణ్ రామ్ తో బింబిసారా లాంటి సోషియో పాంటసీ సినిమా తెరకెక్కించి సూపర్ హిట్ కొట్టిన వశిష్ట ఇప్పుడు ఏకంగా చిరంజీవిని హీరోగా పెట్టి భారీ సోషియో ఫాంట‌సీ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాపై మెగా అభిమానులతో పాటు తెలుగు సినీ అభిమానులు అందరూ ఎంతో ఆసక్తితో ఉన్నారు. గతంలో చిరంజీవి నటించిన జగదేకవీరుడు అతిలోకసుందరి తరహాలో ఈ సినిమా ఉంటుందని వశిష్ట ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు.

అయితే చిరంజీవి ఈ సినిమా చేయటానికి ముందే కుర‌సాల కళ్యాణకృష్ణ దర్శకత్వంలో ఒక సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అసలు చిరు 156వ‌ సినిమా కళ్యాణ్ కృష్ణదే అవుతుందని అంద‌రూ అనుకున్నారు. అనూహ్యంగా మెగా 156వ సినిమా కళ్యాణ్ కృష్ణ నుంచి చేజారిపోయి ఆ ప్లేస్లో విశ్వంభర వచ్చింది. ఇప్పట్లో కళ్యాణ్ కృష్ణకు చిరంజీవి అవకాశం ఇచ్చే సూచనలు కనపడటం లేదు. పైగా కళ్యాణ్ కృష్ణతో చేయాలనుకున్న సినిమా రీమేక్‌ కావటం గమనార్హం.

చిరు వ‌రుస‌గా రీమేకులు చేసి దెబ్బ‌తిన‌డంతో ఇక‌పై వాటికి దూరంగా ఉండాల‌నుకున్నారు. అలాగే మ‌రో యువ ద‌ర్శ‌కుడు వెంకీ కుడుముల ద‌ర్శ‌క‌త్వంలోనూ చిరు ఓ సినిమా అనుకున్నారు. వెంకీ చెప్పిన క‌థ ఫ‌స్టాఫ్ బాగున్నా.. సెకండాఫ్‌లో మార్పులు, చేర్పులు చేయ‌మ‌ని చిరు చెప్పారు. వెంకీ ఆ క‌థ‌పై క‌స‌ర‌త్తులు చేశారు కూడా..! ఆ త‌ర్వాత చిరు ప‌ట్టించుకోలేదు. విశ్వంభ‌ర‌కు క‌మిట్ అయ్యారు.

ఇప్ప‌ట్లో ఈ ఇద్ద‌రు ద‌ర్శ‌కుల‌తో చిరు సినిమా చేసే ఛాన్సులే క‌న‌ప‌డ‌డం లేదు. చిరుతో సినిమా ఛాన్స్ రాగానే ఎంతో ఉత్సాహంగా ఎగిరి గంతేసిన ఈ ఇద్ద‌రు ద‌ర్శ‌కుల ఆశ‌లు ఆవిరైపోయాయి. కురసాల క‌ళ్యాణ్ కృష్ణ అయితే త‌న అన్న మాజీ ప్ర‌జారాజ్యం నేత‌, ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న కుర‌సాల క‌న్న‌బాబుతో కూడా చిరు సినిమాకు రిక‌మెండ్ చేయించినా కూడా ప‌న‌వ్వ‌లేద‌ని తెలుస్తోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news