Moviesఅమ్మ‌, అత్త‌, అల్లుడు త‌ప్పా త్రివిక్ర‌మ్‌కు ఇంకేం ఐడియాలు రావా... నీతో...

అమ్మ‌, అత్త‌, అల్లుడు త‌ప్పా త్రివిక్ర‌మ్‌కు ఇంకేం ఐడియాలు రావా… నీతో సినిమా వ‌ద్ద‌ని దండం పెట్టిన స్టార్ ప్రొడ్యుస‌ర్‌..!

టాలీవుడ్ లో సడన్‌గా ఉరుములేని పిడుగులా అల్లు అరవింద్ – బోయపాటి కాంబినేషన్ సినిమా అనౌన్స్మెంట్ వచ్చేసింది. నిజానికి ఇది కొత్త వార్త కాదు.. చాలా కాలం కిందటే బన్నీతో సరైనోడు సినిమా చేసి సూపర్ హిట్ కొట్టాక అల్లు అరవింద్ తన బ్యానర్ లో బోయపాటితో ఒక మాస్ ప్రాజెక్ట్ చేయాలని అనుకున్నాడు. అఖండ తర్వాత బోయపాటి – అరవింద్ సినిమా ఉంటుందని అల్లు అరవింద్ ఓపెన్ గా ప్రకటించారు. కానీ అప్పటినుంచి అది వార్తల్లో ఉంది. స్కంద ప్లాప్ అయ్యాక బోయపాటి – గీతా కాంపౌండ్ చుట్టూ తిరుగుతున్నారు. అక్కడ బన్నీ కోసం కథ తయారు చేసే పనిలో బిజీ అయ్యారు.

అలాగే అఖండ సీక్వెల్ అఖండ 2 మీద కూడా బోయపాటి కసరత్తులు చేస్తున్నారు. అలాంటి టైంలో హీరో ఎవరో చెప్పకుండా అల్లు అరవింద్ బోయపాటి సినిమా అంటూ ప్రకటించడంతో ఇండస్ట్రీ ఒక్కసారిగా షాక్ అయింది. వాస్తవంగా పుష్ప సినిమా పాన్ ఇండియా రేంజ్ లో సూపర్ డూపర్ హిట్ అయింది. ఇప్పుడు బన్నీ మార్కెట్ పెరిగింది. పుష్ప‌ సీక్వెల్ పుష్ప 2 తర్వాత త్రివిక్రమ్ తో బన్నీ సినిమా చేయాలని అందరూ అనుకున్నారు. ఇప్పుడు గుంటూరు కారం సినిమా ఫలితం చూశాక గీతా కాంపౌండ్ నుంచి ఎలాంటి సౌండ్ లేదు.

బన్నీతో పాటు బన్నీ అనుచరగ‌ణం అల్లు అరవింద్ త్రివిక్రమ్ తో సినిమా చేయటం వేస్ట్ అన్న నిర్ణయానికి వచ్చేసినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం గీతా కాంపౌండ్ లో త్రివిక్రమ్ గురించి వేస్ట్ అన్న చర్చలు నడుస్తున్నాయట. త్రివిక్రమ్ అవుట్ ఆఫ్ ది బాక్స్ ఐడియాలు బాక్సాఫీస్ దగ్గర పని చేయటం లేదు.. త్రివిక్రమ్ ఇంకా అప్డేట్ కావడం లేదు.. త్రివిక్రమ్ ఆలోచనలు పాన్ ఇండియా రేంజ్ లో ఉండటం లేదు.. ఇంకా ఎక్కడో అమ్మ, అత్త, అల్లుడు సినిమాల దగ్గరే ఆగిపోయారని.. ఇప్పటి తరం ఒప్పటి జనం చూసే సినిమాలకు తగినట్టుగా కథలపై ఆయన దృష్టి పెట్టడం లేదన్న‌దే గీతా కాంపౌండ్ చ‌ర్చ అట‌.

ఈ క్లారిటీ వచ్చిన తర్వాత కూడా త్రివిక్రమ్ దర్శకత్వంలో బన్నీ సినిమా చేయటం వేస్ట్ అన్న నిర్ణయానికి వచ్చేసారట. అందుకే త్రివిక్రమ్ మెల్లగా తప్పించే క్రమంలో బోయపాటి సినిమా ప్రకటన వచ్చిందని టాలీవుడ్ లో ఒక్కసారిగా చర్చలు నడుస్తున్నాయి. ఇది కూడా అల్లు అరవింద్ ప్లానింగ్ లో భాగం అంటున్నారు. తర్వాత ఎప్పుడైనా బన్నీ – బోయపాటి సినిమా సెట్స్ మీదకు వెళ్లే ఛాన్సులు ఉన్నట్టు తెలుస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news