బాలీవుడ్లో ముదురు హీరోయిన్ మలైకా అరోరా, కుర్ర హీరో అర్జున్ కపూర్ ప్రేమ వ్యవహారం గత ఏడు ఎనిమిది సంవత్సరాలుగా ఎంత సంచలనంగా మారిందో చూస్తూనే ఉన్నాం. తనకంటే వయసులో 13 సంవత్సరాలు చిన్నవాడైన అర్జున్ కపూర్ తో మలైకా సిగ్గు లేకుండా చెట్టపట్టాలేసుకొని తిరుగుతుంది. వీరిద్దరూ ఎక్కడ చూసినా ప్రేమ పక్షుల్లా మునిగి తేలుతున్నారు. ఇక ఇటీవల మలైక మాజీ భర్త అర్బాజ్‌ఖాన్ కూడా మరో వివాహం చేసుకున్నాడు.
అమ్మ తనకంటే 13 ఏళ్లు చిన్నవాడు అయిన హీరోతో చెట్టపట్టాలేసుకొని ప్రేమాయణం నడుపుతుంటే మలైకా కొడుకు కూడా తానేమన్నా తక్కువ తిన్నానా అంటూ ఓ స్టార్ హీరోయిన్ కూతురును బుట్టలో వేసుకున్నట్టు తెలుస్తోంది. ఒకప్పటి స్టార్ హీరోయిన్ రవీనా కుమార్తె రాషా థడానీ, మలైకా అరోరా కుమారుడు అర్హాన్ ఖాన్‌తో డేటింగ్ లో ఉన్నట్టు తెలుస్తోంది. ఇటీవల కాలంలో వీరిద్దరూ ఎక్కడ చూసుకున్నా చట్టాపట్టాలేసుకొని కనిపిస్తున్నారు. ఇటీవల వీరిద్దరూ కలిసి ఒకే కారులో ఔటింగ్ కూడా వెళ్లారు. మలైకా కొడుకు అర్హాన్; రవీనా కూతురు రాషా డేటింగ్ లో మునిగితేలుతున్నట్టు బాలీవుడ్ మీడియా కూడా కూస్తోంది.
ముంబై మీడియా కూడా ఈ జంట ఎక్కడ కనపడినా వదిలిపెట్టకుండా వెంటాడుతూ ఫోటోలు సంపాదిస్తోంది. ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు కూడా ఈ జంట చాలా క్యూట్ అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. రాశా ఓ దేవతా సుందరిలా ఉంటుంది.. ఆమె రవి నాకు కార్బన్ కాఫీ. కుర్ర కారు కూడా ఆమె ఫోటోలు చూస్తే కళ్ళు తిప్పుకోవడం అంత ఈజీ కాదు. తన నవ యవ్వనంతో ఊరించే గొప్ప అందం ఈ సుందరి సొంతం.
రవీనా టాండన్‌తో కలిసి అర్బాజ్ ఖాన్ రెండో పెళ్లికి ఈ ఇద్దరు కలిసి జంటగా హాజరయ్యారు. ఇక అర్హాన్ తన తల్లి మలైకా సూచన మేరకు లండన్‌లో చదువుతున్నట్టు తెలుస్తోంది. ఇక ధీరుభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ నుంచి పాసైన రాశా థడానీని త్వరలోనే సినీ రంగ ప్రవేశం చేయబోతుంది. వీరిద్దరూ స్కూల్ ఫ్రెండ్స్ అని కూడా తెలుస్తోంది. ఏది ఏమైనా ఇటు మలైకా కొడుకు.. అటు రవీనా కూతురు డేటింగ్ వ్యవహారం ఇప్పుడు బాలీవుడ్ మీడియాను షేక్ చేస్తోంది.