హీరోయిన్లు ఛాన్సుల కోసం తాము పనిచేసే హీరోలను ఆకాశానికి ఎత్తేస్తూ ఉంటారు. ఇప్పుడు ఇదే సూత్రాన్ని బాగా వంటపట్టించుకుంది గుంటూరు కారం బ్యూటీ మీనాక్షి చౌదరి. తాజాగా ఆమె మహేష్‌బాబు గుంటూరు కారం సినిమాలో సెకండ్ హీరోయిన్గా పెద్దగా ప్రాధాన్యత లేని పాత్రలో కనిపించింది. మీనాక్షి సినిమా మొత్తం మీద కనిపించిన సీన్లు తక్కువే అయినా ఆమె చెప్పిన డైలాగులు బాగున్నాయి. ఆమె చాలా అందంగా కనిపించింది.
గుంటూరు కారం సినిమా రిలీజ్ అయ్యే వరకు మీనాక్షి మహేష్‌ను బాగానే పొగిడేసింది. అయితే ఈ సినిమాలో ఆమె పాత్రకు పెద్దగా పేరు రాలేదు. అయితే ఇప్పుడు మీనాక్షి మరో హీరోపై పొగడ్తల వర్షం మొదలు పెట్టేసింది. ఆ హీరోతో పనిచేసే ఛాన్స్ వస్తేనే పెద్ద లక్కీ అంటోంది. ఆ హీరో ఎవరో కాదు కోలీవుడ్ స్టార్ హీరో ఇళయ దళపతి విజయ్. విజయ్‌కు జోడీగా ఆమె నటిస్తున్న ఈ సినిమాకు వెంకట్ ప్రభు దర్శకుడు. ఈ సినిమాలో భారీ తారాగణం నటిస్తోంది.
దళపతి కెరీర్లో ఇది 68వ సినిమాగా తెరకెక్కుతోంది. యువన్ శంకర్ రాజా ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ క్రమంలోనే విజయ్‌తో నటించే ఛాన్స్‌పై మీనాక్షి స్పందించారు. విజయ్‌తో నటించే ఛాన్స్ రాగానే ఆనందంతో తన గుండె ఆగిపోయిందని.. విజయ్‌కు జంటగా నటించే అవకాశం ఎవ్వరికి అయినా అంత సులువుగా రాదని.. అలాంటి అవకాశం వచ్చిన వారు ఎంతో అదృష్టవంతులు అని మీనాక్షి చెప్పింది.
షూటింగ్ జరుగుతున్నప్పుడు విజయ్‌తో తనతో ప్రవర్తించిన విధానాన్ని తాను మాటల్లో అభివర్ణించలేనని చెప్పింది. తాను విజయ్ వీరాభిమానిని అంటూ ఆమె విజయ్ను ఆకాశంలో ఎత్తేస్తూ మాట్లాడుతోంది. ఏదేమైనా మొన్నటి వరకు మహేష్.. ఇప్పుడు విజయ్ ఈమె నటిస్తోన్న హీరోలను మొత్తానికి బాగానే మోస్తోందనే చెప్పాలి.