Moviesమహేశ్ బాబు 'గుంటూరు కారం' సెన్సార్ పూర్తి.. రన్ టైమ్ ఎంతో...

మహేశ్ బాబు ‘గుంటూరు కారం’ సెన్సార్ పూర్తి.. రన్ టైమ్ ఎంతో తెలుసా? ఆ సినిమా చరిత్రను తిరగ రాయబోతున్న త్రివిక్రమ్..!

“గుంటూరు కారం”.. టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న మహేష్ బాబు ఎంతో ఇష్టంగా నటిస్తున్న సినిమా . ఈ సినిమాలో అందాల ముద్దుగుమ్మలు మీనాక్షి చౌదరి – శ్రీ లీల హీరోయిన్లుగా నటిస్తున్నారు . కాగా హారిక అండ్ హాసిని బ్యానర్ పై ఈ సినిమా రూపొందిన విషయం అందరికీ తెలిసిందే. ఇప్పటికే మేకర్స్ ప్రచార కార్యక్రమాలలో బిజీగా ముందుకెళ్ళిపోతున్నారు . జనవరి 12వ తేదీ సంక్రాంతి కానుకగా ఈ సినిమా రిలీజ్ కాబోతుంది .

కాగా ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది . గుంటూరు కారం చిత్రానికి బోర్డ్ U/A సర్టిఫికెట్ ని అందించడం విశేషం . అంటే 12 ఏళ్ల లోపు పిల్లలు పేరెంట్స్ గైడ్ లైన్స్ తోనే ఈ సినిమాని చూడాల్సి ఉంటుంది .సెన్సార్ కార్యక్రమాలు పూర్తవడంతో ప్రమోషన్స్ పనులను చురుగ్గా ముందుకు తీసుకెళ్లి పోతున్నారు మేకర్స్ .ఇప్పటివరకు గ్లింప్స్.. సాంగ్స్ మాత్రమే రిలీజ్ అయ్యాయి. త్వరలోనే రిలీజ్ కాబోతున్న టీజర్ , ట్రైలర్ అభిమానులకు గూస్ బంప్స్ తెప్పించడం పక్కా అంటున్నారు మేకర్స్ .

నెక్స్ట్ రాబోయేది మహేష్ బాబు చరిత్రలోనే నిలిచిపోయే సినిమా అంటూ ప్రమోట్ చేస్తున్నారు. ఈ సినిమా రన్ టైం విషయానికి వస్తే రెండు గంటల 42 నిమిషాల నిడివి ఉంటుంది అంటూ తెలుస్తుంది . ఈ చిత్రం చివరి 45 నిమిషాలు వేరే లెవెల్ లో ఉంటుందని.. ఇప్పటికే నిర్మాత నాగ వంశీ హైప్ పెంచేశారు . అంతేకాదు అతడు సినిమాకి మించిన రేంజ్ లో ఈ సినిమా ఉండబోతుంది అంటూ ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు. ఆయన కెరియర్ లోనే ఇది ఓ బిగ్ మైల్ స్టోన్ క్రియేట్ చేయబోతుంది అని పోకిరి – అతడు తర్వాత మహేష్ బాబు అభిమానులకి ఫేవరెట్ లిస్ట్ లో ఈ సినిమా కూడా ఉండబోతుంది అంటూ చెప్పుకు వస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news