Movies"అతడు"కి "గుంటూరు కారం"కి మహేష్ బాబు లో వచ్చిన మార్పు ఇదే.....

“అతడు”కి “గుంటూరు కారం”కి మహేష్ బాబు లో వచ్చిన మార్పు ఇదే.. స్టేజీ పైనే సీక్రేట్ లీక్ చేసిన త్రివిక్రమ్..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న మహేష్ బాబు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటించిన సినిమా “గుంటూరు కారం”. సర్కారీ వారి పాట సినిమా తర్వాత ఆయన ఎంతో ఇష్టంగా ఈ సినిమాను ఓకే చేసి నటిస్తున్నాడు . అంతేకాదు ఈ సినిమా టైం అసలు బాగోలేదు అని అంతా అనుకున్నారు . సినిమా ఏముహుర్తాన స్టార్ట్ చేశారో అప్పటినుంచి ఒకదాని తర్వాత ఒకటి అవాంతరాలు ఆటంకాలు ఎదురవుతూనే ఉన్నాయి . ఫైనల్లీ సినిమా షూట్ కంప్లీట్ చేసి మరో మూడు రోజుల్లో సినిమా రిలీజ్ అవ్వడానికి సిద్ధంగా ఉండే పొజిషన్ కి తీసుకొచ్చాడు త్రివిక్రమ్.

కాగా రీసెంట్గా గుంటూరులో ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించారు మేకర్స్ . ఈ క్రమంలోనే స్టేజి పైకి వచ్చిన మహేష్ బాబు – త్రివిక్రమ్ – శ్రీ లీల – మీనాక్షి చౌదరి అందరూ కూడా చాలా ఎనర్జిటిక్ గా మాట్లాడే సినిమాకి మంచి జోష్ ఇచ్చారు. అంతేకాదు స్టేజి పైకి వచ్చిన త్రివిక్రమ్ మహేష్ బాబు గురించి మాట్లాడుతూ చాలా చాలా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు .

“కృష్ణ గారు ఎంత మంచి వ్యక్తి అనేది మనందరికీ తెలుసు.. ఆయన లెగిసిని కంటిన్యూ చేస్తున్న మహేష్ బాబు అందుకు డబుల్ మంచి వ్యక్తి.. ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ తో చెబుతున్నాను. మహేష్ బాబు చాలా రిజర్వ్ అది అందరికీ తెలిసిందే . ఆయన పని ఆయన చూసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు . సినిమాల విషయంలో కూడా అంతే ఆయన వర్క్ ఆయన కంప్లీట్ చేసుకుని వెళ్ళిపోతారు అంతే . ఒకటే చెప్తున్నాను అతడు సినిమాను నేను డైరెక్ట్ చేసేటప్పుడు మహేష్ బాబుకి ..ఆ తర్వాత ఖలేజ సినిమాలో వర్క్ చేసిన మహేష్ బాబుకి ..ఇప్పుడు గుంటూరు కారం సినిమాకి వర్క్ చేసిన మహేష్ బాబుకి ఒకటే మార్పు ..ఆయన ఏజ్.. నెంబర్ మారిందేమో కానీ ఆయనలోని ఎనర్జీ ఆయన అందం అస్సలు మారలేదు . ఎనర్జీ పైపైకి వెళ్తుంటే అందం ఇంకా కుర్రాడులా తయారైపోతున్నాడు “అంటూ తనదైన స్టైల్ లో చమత్కరించాడు త్రివిక్రమ్ . ప్రెసెంట్ ఇవే కామెంట్స్ వైరల్ అవుతున్నాయ్..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news