లావణ్య త్రిపాథి.. ఈ పేరు గురించి ఇంతకుముందు కొత్తగా పరిచయాలు చేయాలేమో కానీ.. ఇప్పుడు అస్సలు అవసరం లేదు . మెగా కోడలుగా ట్యాగ్ చేయించుకుని సినిమా ఇండస్ట్రీని సోషల్ మీడియాని షేక్ చేసి పడేస్తుంది .లావణ్య త్రిపాఠి వరుణ్ తేజ్ ని పెళ్లి చేసుకున్నాక ఏ రేంజ్ లో పాపులారిటీ సంపాదించుకుందో మనకు తెలిసిందే. కాగా లావణ్య త్రిపాఠి ప్రజెంట్ పలు వెబ్ సిరీస్ లతో పాటు.. సినిమాలో కూడా నటించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంది.
అఫీషియల్ గా ఒక వెబ్ సిరీస్ ని కూడా అనౌన్స్ చేసింది. ఎవరైనా సరే పెళ్లి తర్వాత భార్యాభర్తలు ఇద్దరు కలిసి తిరగాలి అని ఎక్కడికి వెళ్ళినా జంటగా కనిపించాలి అని కోరుకుంటారు. అయితే లావణ్య త్రిపాఠి మాత్రం వరుణ్ ని వదిలేసి ఎంచక్కా జాలీగా తన పెట్ డాగ్ ని తీసుకొని ఎంజాయ్ చేస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా ఆమె ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. లావణ్య ఏ పనుల కోసం బయటకు వెళ్లిన ప్రతిసారి వరుణ్ కంటే ముందుగా తన పెట్ డాగ్ కి తీసుకువెళ్లడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుందట.
అంతేకాదు రీసెంట్ గా ఆమె ఓ వీడియోని పోస్ట్ చేసింది. ” మీ అండ్ మై గర్ల్” అంటూ తన పెట్ డాగ్ తో వెళ్తున్న ఫోటోని షేర్ చేస్తూ లవ్ సింబల్ జోడించింది . ఈ వీడియో పైన నెటిజన్లు ఫన్నీ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు . లావణ్యకి వరుణ్ కంటే పెట్ డాగ్ ఇష్టం అనుకుంటా అంటుంటే మరికొందరు ఇదేంటి లావణ్య నిహారికలానే చేస్తున్నావ్ అంటూ మరికొందరు కామెంట్స్ పెడుతున్నారు. నిహారిక కూడా పెళ్లి తర్వాత తన భర్తతో కంటే తన ఫ్రెండ్స్ తోనే తిరగడానికి ఇంట్రెస్ట్ చూపించింది . ఆ కారణమే ఇప్పుడు విడాకులు తీసుకునే పరిస్థితి వచ్చింది అన్న విధంగా కామెంట్స్ చేస్తున్నారు..!!