ఎస్ ప్రెసెంట్ ఇవే కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి . బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న కత్రినా కైఫ్ టాలీవుడ్ హీరో బాలకృష్ణ పై చేసిన కామెంట్స్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీని సోషల్ మీడియాని షేక్ చేసేస్తున్నాయి . బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బాలకృష్ణ తనకు గురువు అని ఆయన చెప్పిన మాటలు ఎప్పటికీ మర్చిపోలేను అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.
ఆమె మాట్లాడుతూ..” నేను ఈరోజు ఇంత బాగా డాన్స్ చేస్తున్నాను అంటే దానికి కారణం బాలయ్య గారు చెప్పిన కొన్ని మెలుకువలె .. అల్లరి పిడుగు సినిమాలో డాన్స్ చేస్తున్న సమయంలో ఆయన నాకు కొన్ని స్కిల్స్ నేర్పించారు . అప్పుడు ఆయన దగ్గర నేర్చుకున్న స్కిల్స్ నాకు ఇప్పుడు చాలా బాగా ఉపయోగపడ్డాయి . ఆ క్రెడిట్ మొత్తం బాలయ్యకే ఇస్తాను .. డాన్స్ విషయంలో ఎప్పటికి నా గురువు బాలయ్య గారే” అంటూ కత్రినా కైఫ్ చాలా కాన్ఫిడెంట్ గా చెప్పుకొచ్చింది. ప్రెసెంట్ ఆమె చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయ్.
కాగా బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ అయినటువంటి కత్రినా కైఫ్ బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది . వీళ్ళ పెళ్లయి సంవత్సరం దాటిపోయిన వీళ్ళ దగ్గర నుంచి గుడ్ న్యూస్ రాకపోవడంతో ఫ్యాన్స్ ఆ గుడ్ న్యూస్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. చూద్దాం ఈ జంట ఆ గుడ్ న్యూస్ ఎప్పుడు చెప్తుందో..??