మన అందరికీ తెలిసిందే మెగాస్టార్ చిరంజీవి హనుమాన్ కి వీరభక్తుడు . ఆంజనేయ స్వామి అంటే ఆయనకు చాలా చాలా ఇష్టం. ప్రతి పనిలోనూ ఆయన ఆశీస్సులు తీసుకుంటూ ఉంటారు. చాలామందికి ఈ విషయం తెలిసిందే. కానీ సినిమా ఇండస్ట్రీలో టాప్ హీరోగా ఉండే మెగాస్టార్ చిరంజీవి ఆంజనేయ స్వామి భక్తుడు ఎలా అయ్యాడు..? అంతలా ఎందుకు ఆయన నమ్ముతాడు..? అనే విషయం ఎవరికీ తెలియదు .ఫస్ట్ టైం ఆ విషయాన్ని బయట పెట్టాడు మెగాస్టార్ చిరంజీవి.
రీసెంట్గా తేజ నటించిన హనుమాన్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా హాజరయ్యాడు మెగాస్టార్ చిరంజీవి . ఈ క్రమంలోనే దీనికి సంబంధించిన బిహైండ్ కథ కూడా చెప్పాడు . తాను ఇంతటి స్థాయికి రావడానికి ఆంజనేయ స్వామియే కారణమని .. తనలోని క్రమశిక్షణకు కష్టపడే తత్వానికి హనుమంతుడే కారణమంటూ స్టేజిపైనే చెప్పుకొచ్చాడు. ఆయనపై ప్రేమ ,భక్తి నే తనని నడిపిస్తుంది అని.. ఒక రకంగా తన కులదైవంగా మారిపోయిందని చెప్పకొచ్చారు .
అంతేకాదు చిన్నతనం నుండి ఆంజనేయస్వామి గుడికి ఎక్కువగా వెళ్లే వాడినని ..ప్రసాదం కోసమే గుడికి వెళ్లే వాడిని కానీ అక్కడ ప్రసాదం తింటూ పూజారి గారు హనుమాన్ గురించి చెప్పిన చరిత్రను హనుమాన్ చాలీసా ను పారాయణం చేయడం బాగా నేర్చుకున్నానని.. నాకు తెలియకుండా నేనే ఆయనలో లీనమైపోయానని ..నా నర నరాల్లోనూ ఆంజనేయస్వామి ఉన్నాడు అని చెప్పుకొచ్చాడు . అంతేకాదు చిన్నప్పుడు వారి ఇంట్లో ఎవరూ దైవభక్తులు లేరట . నాన్న కమ్యూనిస్టు అట . అసలు దేవుడినే నమ్మేవాడు కాదట . అమ్మ ఒత్తిడి మేరకు తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకునే వారట . అలా తనకు తెలియకుండా తానే ఆంజనేయ స్వామి భక్తుడిగా మారిపోయాను అన్న విషయాన్ని చెప్పకొచ్చాడు మెగాస్టార్ చిరంజీవి..!!